YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

డిగ్రీలో నయా కోర్సులు

 డిగ్రీలో నయా కోర్సులు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

డిగ్రీ కళాశాలలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పలు కొత్త కోర్సులను ప్రవేశ పెట్టింది.. వీటిలో చాలా ఏళ్లుగా బీఏ, బీ.కామ్‌, బీఎస్సీ లాంటి సాంప్రదాయ కోర్సులే నడుస్తున్నాయి. ఎక్కువగా తెలుగు మాధ్యమంలో ఉన్నాయి. ప్రైవేటు కళాశాలల్లో అన్ని రకాల కోర్సులు ఉన్నాయి. దీంతో తప్పని పరిస్థితుల్లో ఆసక్తి కలిగిన కోర్సుల్లో విద్యార్థులు చేరుతున్నారు. సర్కారు డిగ్రీ కళాశాలలు పట్టణ, మండల కేంద్రాల్లో ఉండటంతో కొత్త కోర్సులు అందుబాటులోకి వస్తే గ్రామీణ విద్యార్థులు, ముఖ్యంగా విద్యార్థినులకు వరంగా మారనుంది. తర్వాత సర్కారు డిగ్రీ కళాశాలల్లో విద్యార్థులు సంఖ్య పెరిగి కళకళలాడనున్నాయి సీబీసీఎస్‌(ఛాయిస్‌ బేస్‌డ్‌ క్రెడిట్‌ సిస్టం)లో భాగంగా నూతన సంస్కరణలకు ఉన్నత విద్యా మండలి శ్రీకారం చుట్టింది. ఈ విద్యా సంవత్సరం నుంచి 13 కోర్సులను అందుబాటులోకి తెచ్చింది. సర్కారు కళాశాలల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్న కోర్సులు వస్తే ముఖ్యంగా గ్రామీణ విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రస్తుతం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు కొన్ని కోర్సులతోనే చాలా ఏళ్లుగా నడుస్తున్నాయి. ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం , కంప్యూటర్‌ విభాగాలకు సంబంధించిన కోర్సులు లేవు. దీంతో కంప్యూటర్‌ కోర్సులు చేయాలంటే 
విద్యార్థులు తప్పని పరిస్థితుల్లో ప్రైవేటును ఆశ్రయిస్తున్నారు. కళాశాలల్లో చేర్చుకునేటప్పుడు ఎలాంటి ఫీజులు లేవని చెబుతున్న ప్రైవేటు కళాశాలలు ప్రవేశాలు పొంది కోర్సు పూర్తి చేసేలోపు అధిక రుసుం వసూలు చేస్తున్నారు. ‘దోస్త్‌’ద్వారా అడ్మిషన్ల ప్రక్రియ ఈ నెల 10న ప్రారంభమైంది. ఆన్‌లైన్‌లో రూ. 200 చెల్లించి రాష్ట్రంలోని ఏ డిగ్రీ కళాశాలలోనైనా నచ్చిన కోర్సును ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. 
కొత్త కోర్సులు ఇవే 
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 2019-20విద్యా సంవత్సరం నుంచి పలు కొత్త కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. ఒక్కో కోర్సులో 30 సీట్లు ఉంటాయి. 
బీఏ(తెలుగు) చరిత్ర, ఆర్థిక శాస్త్రం, పొలిటికల్‌సైన్స్‌(హెచ్‌ఈపీ), పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, పొలిటికల్‌సైన్స్‌(హెచ్‌పీపీ), ఎకనామిక్స్‌, పొలిటికల్‌సైన్స్‌, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఈపీపీ), ఎకనామిక్స్‌, హిస్టరీ, పబ్లిక్‌ 
 
అడ్మినిస్ట్రేషన్‌(ఈహెచ్‌పీ)చరిత్ర, ఆర్థికశాస్త్రం, పొలిటికల్‌సైన్స్‌(హెచ్‌ఈపీ), చరిత్ర, ఆర్థికశాస్త్రం, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌(హెచ్‌ఈసీ), చరిత్ర, పొలిటికల్‌సైన్స్‌, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌(హెచ్‌పీసీ), ఎకనామిక్స్‌, 
 
కంప్యూటర్‌ అప్లికేషన్స్‌(ఈపీసీ).
బీ.కామ్‌లో 
బీ.కామ్‌ జనరల్‌(ఆంగ్ల, తెలుగు మాధ్యమం), 
బీ.కామ్‌ కంప్యూటర్స్‌(ఆంగ్ల మాధ్యమం). 
ఉర్దూ మాధ్యమంలో బీ.కామ్‌(ఉర్దూ)
బీఎస్సీలో 
వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, రసాయనశాస్త్రం (ఆంగ్ల, తెలుగు) 
జీవ రసాయనశాస్త్రం, రసాయనశాస్త్రం, జంతుశాస్త్రం 
జీవ రసాయనశాస్త్రం, వృక్షశాస్త్రం, రసాయనశాస్త్రం 
బయోటెక్నాలజీ, వృక్షశాస్త్రం, రసాయనశాస్త్రం 
సూక్ష్మజీవశాస్త్రం, వృక్షశాస్త్రం, రసాయనశాస్త్రం 
సూక్ష్మజీవశాస్త్రం, జంతుశాస్త్రం, రసాయనశాస్త్రం 
గణితం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం 

Related Posts