YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

శ్రీకాకుళంలో అనుమానలతో డుమ్మా...

శ్రీకాకుళంలో అనుమానలతో డుమ్మా...

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

అదేంటో టీడీపీకి 2014లో అన్నీ కలసి వచ్చాయి. నిలబెట్టిన వారంతా బంపర్ మెజారిటీతో గెలిచారు. ఈసారి మాత్రం అంతా తారు మారు అయిందని తమ్ముళ్ళే అంటున్నారు. శ్రీకాకుళం జిల్లా అంటే పసుపు పార్టీకి కంచుకోట. అటువంటి చోట ఓటమి పిలుపు వినబడడం అంటే ఎక్కడో లోపం ఉన్నట్లేనని అంటున్నారు. ఇదిలా ఉండగా శ్రీకాకుళం అసెంబ్లీ నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేసినా గుండ లక్ష్మీదేవికి ఈసారి ఎదురీతేనని పోలింగ్ అనంతర సర్వేలు చెప్పేశాయి. దానికి కారణం సొంత పార్టీలోనే నాయకులు సరిగ్గా పనిచేయకపోవడం, కొన్ని వార్డుల్లో అయితే నేతలు ఏకంగా వైసీపీకి లొంగిపోవడం వంటివి జరిగాయి. దాంతో లక్ష్మీదేవి గెలుపు డౌట్లో పడిందంటున్నారు. 2014 ఎన్నికల్లో మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణకు టికెట్ వస్తుందని అనుకుంటే జిల్లాకు చెందిన టీడీపీ పెద్ద నాయకుల రాజకీయం వల్ల ఆయన్ని పక్కన పెట్టి భార్య లక్ష్మీదేవికి టికెట్ ఇచ్చారు. దాంతో ఆ సీటు పోయినట్లేనని అనుకున్నారు. కానీ ఆమె మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుని తట్టుకుని మరీ గెలిచారు.ఇదిలా ఉండగా తాజాగా చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాకు చెందిన పార్టీ అభ్యర్ధులతో సమీక్ష సమావేశం అమరావతిలో నిర్వహించారు. దానికి లక్ష్మీదేవి వ్యక్తిగత కారణాల వల్ల వెళ్లలేకపోయారు. అయితే ఆమెతో పాటు మొత్తం క్యాడర్ కూడా వెళ్లకుండా ఆమె చేశారని విమర్శలు సొంత పార్టీ నుంచి వస్తున్నాయి. లక్ష్మీదేవి రాకుండా నాయకులు వెళ్తే ఆమె గురించి ఎక్కడ వ్యతిరేకంగా చెబుతారోనన్న బెంగతోనే ఎవరినీ ఆమె వెళ్ళనివ్వలేదని అంటున్నారు. లక్ష్మీదేవి విజయావకాశాలపై సందేహాలు ఉండడంతో ఆమె ముఖం చాటేశారని కూడా వినిపిస్తోంది. మొత్తానికి 
కేడర్ని ఆమె కట్టడి చేయడం కొత్త చర్చకు దారితీస్తోంది. ఇది అధినాయకత్వం కూడా సీరియస్ గా పరిగణిస్తోంది.లక్ష్మీదేవి సమీక్షకు వెళ్లకపోవడానికి సొంత పార్టీకి చెందిన జిల్లా పెద్దలపై ఉన్న కోపమే 
కారణమని అంటున్నారు. పార్టీలో ఉన్న వారే తనకు వ్యతిరేకంగా పనిచేశారని చెబుతున్నారు. వారే ఓడించాలని చూశారని ఆమె అనుమానిస్తున్నారు. గతసారి తన భర్త ఎమ్మెల్యే అయితే మంత్రి 
పదవికి ఎక్కడ పోటీకి వస్తారో అని టికెట్ ఇవ్వకుండా రాజకీయం చేసిన వారే ఇపుడు తననూ ఓడించేలా పావులు కదిపారని లక్ష్మీదేవి భావిస్తున్నట్లుగా అనుచరులు అంటున్నారు. ఇవన్నీ చంద్రబాబుని మరో సారి కలసి విన్నవించాలనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. ఏది ఏమైనా ఈసారి టీడీపీ ఓడిపోవడానికి వైసీపీ కంటే సొంత పార్టీ వారే కారణమని తమ్ముళ్ళే చెబుతున్నారు. అదే జరిగితే మొహమాటం లేకుండా పార్టీని మొత్తం ప్రక్షాళన చేయాల్సిందేనని అంటున్నారు.

Related Posts