అందాలతార శ్రీదేవి మంచి నటి మాత్రమే కాదు, ఓ మంచి కళాకారిని కూడా. ఖాళీ సమయాల్లో ఆమె పెయింట్స్ వేస్తుండేవారట. శ్రీదేవి మరిది అనిల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్ బాలీవుడ్ ఎంట్రీ సినిమా 'సావరియా'లో ఒక ఫోటో శ్రీదేవికి చాలా బాగా నచ్చిందట. దీంతో ఆ ఫొటోను ఆమె పెయింటింగ్ వేసింది. పాప్ రారాజు, దివంగత మైఖేల్ జాక్సన్ చిత్రాన్ని కూడా ఆమె పెయింటింగ్ వేసింది.
మైఖేల్ జాక్సన్ పెయింటింగ్ అంటే తనకు చాలా ఇష్టమని గతంలో ఆమె చెప్పింది. దుబాయ్ కి చెందిన అంతర్జాతీయ ఆర్ట్ హౌస్ ఆ రెండు పెయింటింగ్స్ ను చూసి ఆమెను సంప్రదించి ఆ పెయింటింగ్స్ ను వేలానికి పెట్టాలని కోరింది. అయితే, అందుకు శ్రీదేవి ఒప్పుకోలేదు. ఆ వేలం ద్వారా వచ్చిన డబ్బును ఒక ఛారిటీకి విరాళంగా ఇస్తామని చెప్పడంతో ఆమధ్య ఆమె తన చిత్రాలను వేలానికి ఇచ్చారని అంతర్జాతీయ ఆర్ట్ హౌస్ తెలిపింది. కాగా మైఖేల్ జాక్సన్ పెయింటింగ్ ను 8 లక్షల ప్రారంభ ధరతో త్వరలో వేలం వేయనున్నట్టు అంతర్జాతీయ ఆర్ట్ హౌస్ చెప్పింది.