YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

గవర్నర్ ను కలిసిన కేవీపీ... పోలవరం అవినీతిపై విచారణకు వినతి

గవర్నర్ ను కలిసిన కేవీపీ... పోలవరం అవినీతిపై విచారణకు వినతి
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ను కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ కేవీపీ రామచంద్రరావు గురువారం ఉదయం కలిశారు. పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని, ఈ విషయమై విచారణ జరిపించి, చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను కలసి వినతిపత్రాన్ని అందించారు. తరువాత అయన మీడియాతో మాట్లాడారు. అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని, ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేసేందుకు కృషి చేయాలని కోరినట్టు వెల్లడించారు. తన నుంచి గవర్నర్ మరిన్ని వివరాలను కోరారని, తన వద్ద ఉన్న అన్ని వివరాలనూ ఆయనకు అందించానని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల బాగుకోసం ఈ ప్రాజెక్టు ఎంతో అవసరమని చెప్పానని పేర్కొన్నారు. పోలవరం విషయం లో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రెండూ విభజన చట్టాన్ని ఉల్లఘించాయి. టీడిపి ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకం గా కాస్ట్  ఎస్కలేషన్ భారం సహ అనేక కండిషన్ లకు ఒప్పుకొన్ని పోలవరం నిర్మాణాన్ని  తీసుకొన్నది. ఈ ప్రాజెక్ట్  నిర్మించడం వల్ల రాష్ట్రం పై పడ్డ ఆర్ధిక భారం విషయం లో ప్రజలకు అసత్యాలను చెపుతున్నది. టీడిపి ప్రభుత్వం పదే అడిగి కేంద్రం వెంటపడి, విభజన చట్టానికి వ్యతిరేకంగా ఈ ప్రాజెక్ట ను కేంద్రానికి బదులుగా  తాను నిర్మించడం లో నిగూఢమైన ఉద్దేశ్యం ఉన్నది. పోలవరాన్ని  జాతియ ప్రాజెక్ట్ గా ప్రకటించడమే కాకుండా ఈ ప్రాజెక్ట్ పూర్తి ఖర్చు ను కాస్ట్ ఎస్కలేషన్ తో సహ కేంద్రామే భరించాలని అప్పటి యూపీయే  ప్రభుత్వం నిర్ణయించిందని కేవీపీ తన వినతీపత్రంలో పేర్కోన్నారు. .టీడిపి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ కు పోలవరానికి సంబంధించిన  ఆస్తులు, అప్పులు బదలాయించడానికి ఎప్పుడు సహకరించ లేదు, పోలవరం నిర్మాణాన్ని చేపట్టనివ్వలేదు.  కేంద్ర జల వనరుల శాఖ కు సంబంధించిన సలహా కమిటి ఈ మధ్య  జరిగిన మీటింగ్ లో పోలవరం సవరించిన అంచనాలను 2017-18 ప్రైస్ లెవెల్ నూ 2013-14 ప్రైస్ లెవల్ ను ఆమోదించింది. ఈ రెండు అంచనాల మధ్య తేడా కొన్ని కోట్లు రాష్ట్రమే భరించాలి. సాధారణం గా జాతీయ ప్రాజెక్ట గా ప్రకటించ బడ్డ ఇరిగేషన్ ప్రాజెక్ట లకు 90 % నిధులను కేంద్రం గ్రాంట్ గా సమకూరుస్తుంది. పోలవరాన్ని అదేవిధంగా భావించినా, కనీసం 50.000 కోట్లు గ్రాంట్ గా రావాలి. కాని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం  నిర్వాకం వల్ల రాష్ట్రానికి తీవ్ర నఫ్టం జరిగిందని అయన విమర్శించారు. 
ను వేసిన ప్రజా ప్రయోజ వ్యాజ్యం  లో కౌంటర్ వేస్తే ప్రాజెక్ట నిర్మాణాన్ని తీసుకోవడానికి  తాము ఒప్పుకొన్న కండిషన్స్ బయట పెట్టవలసి వస్తుందనే భయం తోనే రాష్ట్రం ఉద్దేశ్యం పూర్వకం గానే కౌంటర్ వేయడం లేదు. పోలవరం నిర్మాణం విషయం లో నిధుల విషయం లో గందరగోళం నెలకొన్ని ఉన్నది. ఏది పారదర్శకం గా జరగడం లేదు. ముఖ్యమంత్రి గాని, జల వనురుల శాఖామంత్రి గాని, పోలవరం విషయన్ని చూస్తూన్న ఏ రాష్ట్ర  ప్రభుత్వ ఉన్నత అధికారి గాని ముందుకు వచ్చి, పోలవరం నిర్మాణం రాష్ట్రం చేతులలోకి తీసుకోవడం వల్ల రాష్ట్రం పై ఎటువంటి ఆర్ధిక భారం పడలేదని, ఒక వేళ నిజంగా పడితే దానికి తాను బాధ్యత వహిస్తానని అని ఒక అధికారి ప్రకటన చేస్తే నేను నా వాదనలు అన్ని వెనక్కి తీసుకొని  రాష్ట్ర ప్రభుత్వానికి బహిరంగ క్షమాపణలు చెప్పడానికి సిద్ధమని అయన అన్నారు.  పోలవరం పై ఒక శ్వేత ప్రత్రాన్ని విడుదల చేసేలా రాష్ట్ర ప్రభుత్వాని ఆదేశించి. రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయాలని గవర్నర్ ను కోరానని అన్నారు. తాను గవర్నర్ కు ఇచ్చిన వినతిపత్రంలో ఎన్నో విషయాలను పొందుపరిచానని, వాటన్నింటినీ పరిశీలించి చర్యలు తీసుకుంటానని గవర్నర్ హామీ ఇచ్చారని కేవీపీ తెలిపారు.

Related Posts