యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
కాంగ్రెస్ వెంట నడిచినా.. రేపు వైసీపీను కూడా హస్తం దగ్గరకు తీసే అవకాశం ఉంది. ఏపీలో పరిస్థితి ఎలా ఉటుందనేది అంచనా వేయటం కూడా కష్టంగా మారింది. ఇటువంటి విభిన్న పరిస్థితుల్లో కోరి కష్టాలు కొని తెచ్చుకోవటం కంటే.. తెలివిగా వ్యవహరించేందుకు బాబు సిద్ధమయ్యారు. దానిలో భాగమే కమ్మ వర్గానికి చెందిన బడావ్యాపార, పారిశ్రామిక, రాజకీయ వేత్తలతో సమావేశం. దానికి రామోజీరావు నుంచే నడుంబిగించారనేది బయటకు వస్తున్న ఊహాగానాల లెక్కలు. ఎందుకంటే రామోజీరావు చెబితే.. ఏపీ, తెలంగాణలతో సహా పలు చోట్ల కమ్మ, కమ్మేతర వ్యాపారులు సహకరించే అవకాశాలున్నాయి. తెలంగాణలో టీడీపీకి గడ్డుకాలం నడుస్తుంది. పాతకేసులు తిరగతోడమని.. స్టే లున్న కేసులను మరోసారి బయటకు తీయమంటూ సుప్రీం ఆదేశాలతో అన్నీ చక్కదిద్దేందుకు బాబు వేసిన ఎత్తుల్లో కమ్మలాబీయింగ్ కూడా ఒకటి. వచ్చేవారం ఎన్నికల ఫలితాల్లో బీజేపీ పూర్తిస్థాయి మెజార్టీ సంపాదించినా, లేకపోయినా తాము వారికి మిత్రులమే అనే సంకేతాన్ని వెంకయ్యద్వారా పంపించాలనేది బాబు వ్యూహమట. అందుకే.. రంగంలోకి కమ్మకోటరీను దింపి.. తాను అంతా నడిపించాలనేది బాబు ఎత్తుగడగా విపక్షాలు అంచనా వేస్తున్నాయి. హస్తం, బీజేపీల్లో ఎవరికైనా తాము మద్దతునిస్తామని అయితే.. తాము అండగా ఉండేచోట.. కేసీఆర్, జగన్ మాత్రం ఉండకూడదనేది టీడీపీ అధినేత మొదటి షరతుగా తెలుస్తోంది.ఏపీ రాజకీయాల్లో కమ్మసామాజికవర్గానికి తిరుగులేనిది. సంఖ్యాపరంగా తక్కువగా ఉన్నా.. విద్యావంతులు, రాజకీయ, వ్యాపార వర్గాలతో అంతా తామై చక్రం తిప్పేదాకా ఎదిగారు. అమెరికాలోని కొన్ని చోట్ల.. వీరే అధ్యక్ష ఎన్నికల్లో కీలక భూమిక పోషించటం ఆ వర్గం ఎంతగా పాతుకు పోయిందనేందుకు నిలువెత్తు సాక్ష్యం. ఏపీలో కమ్మ, రెడ్డి వర్గాలు దశాబ్దాలుగా పెత్తనం సాగిస్తూ వచ్చారు. అయితే గతానికి భిన్నంగా 2014లో కుల సమీకరణలు విజయాన్ని నిర్దేశించేంతగా మారాతాయనేది అవగతమైంది. 2014లో టీడీపీ గెలుపుకోసం వెంకయ్యనాయుడు అన్నీతానై బీజేపీ పెద్దలతో సర్దుబాట్లకు బాట వేశారు. ఆ తరువాత బీజేపీ అధినాయకత్వం కూడా ఏపీలో కమ్మ కోటరీకు బీటలు కొట్టాలనే ఉద్దేశంతో వెంకయ్యనాయుడును ఉపరాష్ట్రపతిని చేసి మూలాలపై దెబ్బతీశారు. మంత్రివర్గంలో ఉన్న సుజన, అశోక్‌గజపతిరాజు వంటి వాళ్లను కూడా పక్కనబెట్టారు. ఇదంతా కేవలం టీడీపీను దెబ్బతీయాలనేది చంద్రబాబు ముందుగానే అర్థం చేసుకున్నాడు. దానికి ఏపీ ప్రత్యేకహోదా ముసుగు తొడిగి కమలంతో కటీఫ్ కొట్టారు. అయితే తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికలతో బాబుకు ఒక విషయంపై స్పష్టత వచ్చిందనే చెప్పాలి. ఓటర్లలో చైతన్యం బాగా వచ్చింది. పైగా కుల సమీకరణలతో కమ్మ, నాన్‌కమ్మగా మారి ఓడించే అవకాశాలున్నాయనే అంశం కూకట్‌పల్లి ఓటమి అనుభవం నుంచి చవిచూశారు. . మరి ఈ లెక్కన.. బాబు కొత్త వ్యూహం ఎంత వరకూ వర్కవుట్ అవుతుందనేది మరో ఏడు రోజుల్లోకానీ తెలియదు.-