YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఈసీ పక్షపాత వైఖరి మరోసారి బహిర్గతం

ఈసీ పక్షపాత వైఖరి మరోసారి బహిర్గతం

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

వైసీపీ ఫిర్యాదు మేరకు చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్కు ఆదేశించటంతో ఎన్నికల సంఘం పక్షపాత వైఖరి  మరోసారి బహిర్గతమైందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామినిశర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఉండవల్లి  లోని ప్రజావేదిక సమీపంలోని మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ.... టీడీపీ ఫిర్యాదులు పట్టించుకోవడానికి  సమయంలేని ఈసీకి బీజేపీ, వైసీపీల ఫిర్యాదులపై పరుగు పరుగున స్పందించటం శోచనీయమని, రాజ్యాంగాన్ని సైతం  అవమానపరుస్తూ బీజేపీ, వైసీపీల అడుగులకు మడుగులొత్తుతు ఎన్నికల సంఘం అధికారులు 
వ్యవహరించటం అత్యంత బాధాకరమని  ఆమె వ్యాఖ్యానించారు. కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీ, వైసీపీలకు తొత్తుగా మారిందన్నారు. ఎలక్షన్ కమిషన్ పేరును వైసీపీ, బీజేపీ కమిషన్  అని మార్చుకుంటే బాగుంటుందన్నారు. చంద్రగిరి నియోజకర్గంతో సహా మరి కొన్ని చోట్ల రీపోలింగ్ నిర్వహించమని మేం ముందుగానే  ఈసీని కోరినప్పటికి ఈసీ పట్టించుకోలేదన్నారు. కానీ వైసీపీ నేతలు ఫిర్యాదు చేసిన వెంటనే చంద్రగిరిలో రీపోలింగ్కు ఈసీ  
ఆదేశాలిచ్చిందన్నారు. ఎన్నికలు జరిగిన 25 రోజుల తర్వాత ఇచ్చిన పిర్యాదు మేరకు ఈసీ ఎలా రీపోలింగ్  నిర్వహిస్తుందని ప్రశ్నించారు. ఈసీ రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరిస్తోందని అన్నారు. ఏపీలో ప్రజా సమస్యలపై సమీక్ష నిర్వహించడానికి కోడ్ అన్న ఈసీ...మోదీ నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల ప్రచార సభల్లో సైనికుల త్యాగాలను రాజకీయానికి వాడుకున్నా ఆయనకు మాత్రం క్లీన్చీట్ ఇచ్చిందని తెలిపారు. 
మోదీ, అమిత్షాలు తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకునేందుకు అక్రమంగా అడ్డడారులు తొక్కుతున్నారని అన్నారు.  ప్రతిపక్ష పార్టీలు, మేధావులు, చివరకి ప్రజలపై కూడా మోదీ, అమిత్షాలు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.  ప్రజాసామ్యాన్ని తుంగలో తొక్కిన మోదీ, అమిత్షాలకు ప్రజలే తగిన బుద్ది చెబుతారని ఆమె అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ 5  ఏళ్లలో అనేక సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు చేపట్టి ఆ అభివృద్దిని ప్రజలకు పంచారని, చంద్రబాబు నిరంతర అభివృద్ది శిల్పిలా రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజల కోసం పనిచేస్తుంటే... జగన్కి మాత్రం ఎప్పుడు ఏ పని  చేయాలో కూడా తెలీదని విమర్శించారు. లోటస్పాండ్ ఖాళీ 
చేసి ఇప్పుడు ఏపీకి వచ్చి జగన్ చేసేదేంటని ప్రశ్నించారు. ఈ సారి వైసీపీకి  ప్రతిపక్ష హోదా కూడా దక్కదని వెల్లడించారు.

Related Posts