YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

క్షీణించిన పసిడి ధరలు

క్షీణించిన పసిడి ధరలు
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
గత రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన పసిడి ధర పడిపోయింది.  దేశీ మార్కెట్లో బుధవారం పది గ్రాముల బంగారం ధర రూ.135 తగ్గుదలతో రూ.33,260కు క్షీణించింది.  జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ తగ్గడం ఇందుకు ప్రధాన కారణం. 
బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. కేజీ వెండి ధర రూ.100 తగ్గుదలతో రూ.38,200కు క్షీణించింది. 
పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ప్రతికూల ప్రభావం చూపింది.  దేశీ మార్కెట్లో బంగారం ధర తగ్గితే అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం పసిడి ధర పెరిగింది.   గ్లోబల్ మార్కెట్లో బంగారం ధర ఔన్స్కు 0.20 శాతం పెరుగుదలతో 1,298.95 డాలర్లకు చేరింది.  వెండి ధర ఔన్స్కు 0.11 శాతం పెరుగుదలతో 14.82 డాలర్లకు ఎగసింది. అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు ఇందుకు కారణం.  ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.135 తగ్గుదలతో రూ.33,260కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.135 తగ్గుదలతో రూ.33,090కు క్షీణించింది.  ఇక 
ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర రూ.26,500 వద్ద స్థిరంగా కొనసాగింది. కేజీ వెండి ధర రూ.100 తగ్గుదలతో రూ.38,200కు క్షీణిస్తే.. వారాంతపు ఆధారిత డెలివరీ ధర 
రూ.50 క్షీణతతో రూ.37,510కు తగ్గింది. 

Related Posts