యువ్ న్యూస్ ఫిలిం బ్యూరో:
కుర్రకారు హృదయాలను దోచుకున్న చార్మీ హఠాత్తుగా నటనకు కామా పెట్టేసి నిర్మాణం వైపు దృష్టి పెట్టింది. రేపు చార్మీ పుట్టిన రోజు .. ఈ సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడింది.
"13 ఏళ్ల వయసులోనే నేను సినిమాల్లోకి వచ్చాను .. అన్ని భాషల్లోను కలుపుకుని ఇంతవరకూ 55 సినిమాల్లో నటించాను. కెరియర్ పరంగా ఎన్నో ఒడిదుడుకులు చూశాను. కథానాయికగా నేను కొనసాగించిన నా కెరియర్ పట్ల సంతృప్తిగానే వున్నాను. ఇప్పటికీ తమ సినిమాల్లో చేయమంటూ నాకు చాలామంది అవకాశాలు ఇస్తున్నారు. కానీ నేను సున్నితంగా తిరస్కరిస్తూ, నిర్మాణం పైనే దృష్టి పెడుతున్నాను అని చెప్పుకొచ్చింది.