YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వరదలపై అప్రమత్తం

వరదలపై అప్రమత్తం
నైరుతి  రుతుపవనాల కారణంగా జిల్లాలో వరదలు సంభవిస్తే వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు  అవసరమైన ప్రణాళికలను 16 రోజుల్లో ఇవ్వాలని  జిల్లా కలెక్టర్ ఎస్ సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేటులోని సమావేశ మందిరంలో నైరుతి రుతుపవనాల కారణంగా జిల్లా లో వరదలు సంభవిస్తే వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికలపై జిల్లా అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ నుంచి సెప్టెంబర్ వరకు పవనాల వల్ల మన జిల్లాకు అధిక వర్షాలు వచ్చే అవకాశం వుంటుందని అన్నారు. అనుకొని విధంగా వరదలు సంభవిస్తే సమర్ధవంతంగా వాటిని ఎదుర్కొనేందుకు  ప్రతి శాఖ సంసిద్ధంగా ఉండాలన్నారు. వరదలకు గురయ్యే ప్రాంతాలను గ్రామాలను ముందుగానే గుర్తించి పబ్లిక్ అడ్రాస్ సిస్టమ్ టీవీ. ఛానల్స్ పత్రికల దంవారా ప్రజలను అప్రమత్తం చేయాలని రెవిన్యు అధికారులను ఆదేశించారు. వరదలు రావడానికి  ముందు, వరదలు వచ్చిన సమయంలో వరదలు అనంతరం తీసుకోవాల్సిన చర్యలు పై సంబంధిత శాఖలన్నీ పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. లోతుట్టు ప్రాంతలో ప్రజలను అప్రమత్తం చేస్తూ సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన పాఠశాలలు, కాలేజిలు, కమ్యూనిటి హాల్స్ ను ముందుగా నే గుర్తించాలన్నారు. వరదల వల్ల దెబ్బతినే రోడ్లు ను గుర్తించాలన్నారు. అలాగే పెద్ద పెద్ద చెట్లు విరిగిపోయే అకాశం ఉన్నందున ముందుగానే చెట్ల  కొమ్మలను తొలగించడం ద్వారా చెట్లును కాపాడే మే గాక ట్రాఫిక్ అంతరాయం లేకుండ చేయవచ్చునన్నారు. గండ్లు పడే అవకాశం వున్న కాలువలు , చెరువులు, గుర్తించి ముందస్తు చర్యలు తీసుకొవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్వొ వెంకటేశం , ఆదోని, కర్నూలు, నంద్యాల ఆర్టీఓలు రామమూర్తి, వెంకటేశం, నారాయణమ్మ, డా.ప్రసాద్, ఆనంద్ నాయక్, జలవనరుల శాఖల ఎస్.ఇలు, జయరామిరెడ్డి, సుబ్బారెడ్డి తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Related Posts