YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

సినిమా

వారెవా...సూపర్ స్టిల్ గురూ...! అల్లు అర్జున్ ఫోజులపై నెటిజన్ల ఫిదా...!!

Highlights

  • నా పేరు సూర్య సినిమా లేటెస్ట్ పోస్టర్‌కి విశేషమైన ఆదరణ
  • అల్లు అర్జున్ ఫోజు అదిరిపోయిందంటూ నెటిజన్ల ట్వీట్లు
  • సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫోజు వైరల్
వారెవా...సూపర్ స్టిల్ గురూ...! అల్లు అర్జున్ ఫోజులపై నెటిజన్ల ఫిదా...!!

రచయిత వక్కంతం వంశీ డైరెక్షన్‌లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న 'నా పేరు సూర్య...నా ఇల్లు ఇండియా' చిత్రం విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ఆ చిత్రంపై అంచనాలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ సినిమాకి సంబంధించి గతంలో విడుదలయిన ట్రైలర్‌కి విపరీతమైన క్రేజ్ వచ్చిన సంగతి అందరికి తెలిసిన విషయమే.

ఈ చిత్రం లో "ఇక్కడ కాదు..బోర్డర్‌లో చనిపోతా" అంటూ అల్లు చెప్పే డైలాగ్‌కి ఆయన అభిమానులు ఫిదా అయిపోయారు. ఈ సినిమా కచ్చితంగా హిట్టేనంటూ వారు నమ్మకం గా చెప్పేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ సినిమాకి సంబంధించి తాజాగా విడుదలయిన పోస్టర్ అంచనాలను మరింత పెంచుతుంది అని తెలుస్తుంది. ఈ స్టిల్ చూసి అల్లు అర్జున్ ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్లు 'వారెవా ఏమి స్టిల్ గురూ..అదుర్స్' అంటూ తెగ కితాబు ఇస్తున్నారు. ఆర్మీ జీపులో స్టీరింగ్ పట్టుకుని స్టైల్‌గా నోట్లో చుట్ట పెట్టుకుని అల్లు అర్జున్ ఇచ్చిన ఫోజో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

Related Posts