YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అమరావతి...డిజైన్ మారుతుందా...

అమరావతి...డిజైన్ మారుతుందా...

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో: 

అమరావతి… రాజధాని నిర్మాణం ఇంకా ప్రారంభం కాలేదు. మొదటి అడుగులోనే ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దాలనుకున్నారు. అందుకోసం ఎన్నో డిజైన్లను చూశారు. రైతుల నుంచి ఉచితంగా భూములు తీసుకున్న ప్రభుత్వం అంతేవేగంతో రాజధాని నిర్మాణం చేపట్టలేకపోయిందన్న విమర్శలు ఉన్నాయి. కేంద్రం నుంచి నిధులు తగినన్ని రాకపోవడంతోనే రాజధాని నిర్మాణంలో జాప్యం జరిగిందని చంద్రబాబు చెబుతున్నా అది నమ్మశక్యంగా లేదంటున్నాయి విపక్షాలు.ఎందుకంటే ఐదేళ్ల పాటు తాత్కాలిక భవనాల పేరిట నిధులను స్వాహా చేశారన్నది విపక్షాల ఆరోపణ. అయితే నారా చంద్రబాబు నాయుడికి రాజధాని నిర్మాణం పట్ల ఒక విజన్ ఉంది. ఆయన రాజధాని నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. చంద్రబాబు తిరిగి అధికారంలోకి వస్తేనే రాజధాని నిర్మాణం పూర్తవుతుందని ప్రజల చేత మరోసారి ఓట్లు వేయించు కోవడానికే నిర్మాణ పనులను ఐదేళ్లలో ప్రారంభించలేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. చంద్రబాబు మాత్రం తన కలల రాజధాని నిర్మాణానికి అవసరమైన వాటిని సిద్ధం చేసుకునే లోపే ఎన్నికలు వచ్చేశాయి. రాజధాని నిర్మాణాన్ని లక్షా పదిహేను వేల కోట్ల రూపాయలతో మూడు దశల్లో నిర్మించాలని ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. 2050 నాటికి పూర్తి స్థాయి రాజధాని నిర్మాణం జరగాలన్నది చంద్రబాబు ఆలోచన. మొదటి దశ పనులు ప్రారంభమయ్యాయి. ఈ దశలో యాభై మూడు వేల కోట్ల రూపాయల పనులు జరగాల్సి ఉండగా, 43 వేల కోట్ల రూపాయల మేర పనులు ప్రారంభమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి కేవలం 1500 కోట్లు మాత్రమే విడుదల చేసింది.చంద్రబాబు రాజధాని నిర్మాణం కోసం సింగపూర్ కన్సార్టియంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అమరావతిలో మొత్తం 9 నగరాలు, మూడు పట్టణాలు ఉంటాయి. 
పరిపాలన, న్యాయ, ఆరోగ్య, విద్య, ఆర్థిక, క్రీడ, పరిశ్రమ, పర్యాటక, మీడియా నగరాలను నిర్మించాలన్నది చంద్రబాబు ఆలోచన. అమరావతిని గ్రీన్ అండ్ బ్లూగా నిర్మించాలని భావించారు. అయితే ఈ ఎన్నికల్లో చంద్రబాబు కాకుండా జగన్ అధికారంలోకి వస్తే ప్లాన్ మారతుందా? అన్న ఆలోచన అధికారుల్లో లేకపోలేదు. ప్రధానంగా ఐఏఎస్ అధికారులు ఈ రకమైన వ్యాఖ్యలు బహిరంగంగానే చేస్తున్నారు. రాజధాని దానంతట అదే అభివృద్ధి కావాలి కాని, కట్టడాలను నిర్మించి డెవలెప్ చేయలేమన్నది జగన్ పార్టీ వాదన. దీంతో చంద్రబాబు అమరావతి విజన్ కు జగన్ చెక్ పెడతారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

Related Posts