యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఎన్నికల సంఘం ఇష్టానుసారం వ్యవహరించింది. స్వతంత్రంగా ఉండాల్సిన ఎన్నికల సంఘం ఎవరి ఒత్తిడిలకు లొంగి పని చేస్తుంది. ఈవిఎం లు మార్పులో కూడా అనేక అనుమానాలు ఉన్నాయని మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. శుక్రవారం అయన మీడియాతో మట్లాడారు. ప్రశాంత్ కిషోర్ ముందుగానే ఈవిఎం పని తీరు గురించి ఎలా మాట్లాడారు. ఎన్నికలలో వారు చేసిన పాపాలు త్వరలోనే బయట పడతాయి. జగన్, విజయసాయి రెడ్డి లు ప్రశాంత్ కిషోర్ లు అనేక కుట్రలు చేశారు. ఒకసారి పోలింగ్ బూత్ కు ఓటర్లు వచ్చి తిరిగి ఎందుకు వెళ్లారని అన్నారు. ఢిల్లీలో కొత్త ప్రభుత్వం వస్తుందని కేసిఆర్ కు కూఢా అర్దమైపోయింది. జగన్ తో కలిస్తే ఆ అవినీతి మరక తనకు కూడా అందుతుందని కేసిఆర్ భావించారు. అందుకే జగన్ కు దూరంగా ఉండాలని, హైదరాబాద్ నుంచి పంపాలని కేసిఆర్ తన పార్టీ శ్రేణులకు ఆదేశాలిచ్చారని అయన అన్నారు. వైసిపి గెలుస్తుందని హైప్ క్రియేట్ చేసి పందాలు కాయించారు. ఇప్పుడు ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులకు అసలు విషయం బోధ పడింది. పందాలు కాసిన వారు నేడు టిడిపి వస్తుందని తిరుగు పందాలు కాస్తున్నారని అన్నారు. పోలవరం అడ్డుకునేందుకు జగన్ రెడ్డి అనేక కుట్రలు చేశారు. డ్యాం సైట్ ను పూర్తి గా చూడకుండా, నిపుణులను సంప్రదించకుండా బురద జల్లడం జగన్ రెడ్డి బ్యాచ్ కే చెల్లింది. రాజమండ్రి లో ప్రెస్ మీట్ దుగ్ద మొత్తం కక్కితే, ఆ విషపు పత్రికలో సిగ్గులేకుండా రాసుకున్నారు. అధికార దాహంతో జగన్ కుట్రలు చేస్తున్నారు. మే 23 తర్వాత జగన్ ఆరోగ్య పరిస్థితి పై దృష్టి పెట్టాలని అతని కుటుంబ సభ్యులను కోరుతున్నానని అన్నారు. గతంలో టీవీ పగలకొట్టిన జగన్.. ఈసారి ఎటువంటి దారుణాలకు పాల్పడతాడో. వైయస్ ఆత్మబంధువు ఢిల్లోలో ఉంటూ ఎపి ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. ఇప్పుడు కేసిఆర్ ఆత్మబందువుగా మారి రాజ్యసభ సీటు పొందాడు. ఢిల్లీ లో కూర్చుని పోలవరం పూర్తి చేయాలని మోడి ఉత్తరాలు రాయడు. పోలవరం అడ్డుకుంటున్న కేసిఆర్, కవితలను ప్రశ్నించడని విమర్శించారు. పోలవరం పూర్తి చేసేందుకు కష్టపడుతున్న చంద్రబాబు కు ఉత్తరాలు రాస్తాడు. ఈ జిత్తులమారి నక్క అమెరికా లో అనేక కేసుల్లో ఇరుక్కున్నాడు. ఇటువంటి అవినీతి పరులు మాకు శ్రీరంగ నీతులు చెబుతారు. వయసు రాగానే కాదు.. కొంచెం అయినా బుద్ది ఉండాలయ్యా. విజయసాయి రెడ్డి విషపు రెడ్డిగా మారి ట్విట్టర్ దొంగగా మారాడు. ఈ డర్టీ మ్యాన్ కు 23 తర్వాత జైలులో చిప్ప కూడే గతని వ్యాఖ్యానించారు. అవినీతి పందులు బురదలో దొర్లుతూ అందరి మీద జల్లాలని కుట్రలు చేస్తున్నారు. కేసిఆర్ కు జగన్ ఓటమి ఖాయమని అర్దమయ్యే లోటస్ పాండ్ ఖాళీ చేయించారు. పోలవరం వద్ద పనులు చాలా వేగవంతం గా జరుగుతున్నాయి. అధికారులు అహర్నిశలు కష్టపడుతుంటే జగన్ బ్యాచ్ కుట్రలు చేస్తున్నారు. ప్రజలు కూడా అన్నీ అర్దం చేసుకున్నారు.. వారికి తగిన బుద్ది చెబుతారు. నిన్నే వైయస్ శిక్షణ చూశాం.. ఎ2 ముద్దాయి ప్రవచనాలు చెబుతున్నాడు. పాలిట్ బ్యూరో కింద కుక్కిన పేనుల్లా కూర్చున్నారు.ఇదీ జగన్ రెడ్డి పార్టీ బతుకు. అవినీతిపరులే. అక్కడ నాయకులు ఫలితాలు రాకముందే దేశంలో 21ప్రాంతీయ పార్టీలను చంద్రబాబు ఏకం చేశారు. మోడి, అమిత్ షా చేసిన కుట్రలను దేశ ప్రజలకు చాటి చెప్పిన నేత చంద్రబాబు. రాజ్యాంగ వ్యవస్థ లను నిర్వీర్యం చేసి, పత్రికల యాజమాన్యాలను బెదిరించడమే మోడి పని ప్రశ్నించిన రాజకీయ పార్టీల నేతల పై దాడులు చేయించి బేదిరించడమే మోడీ పాలన. 23 తర్వాత దేశంలో మోడి, ఎపి లో జగన్ మూటా ముల్లె సర్దుకోవడం ఖాయం. ఎపి ప్రజలతో ఎందుకు పెట్టుకున్నానా అని మోడి ఫలితాల తర్వాత అనుకుంటాడు. మళ్ళీ టిడిపి విజయం సాధించడం, చంద్రబాబు సిఎం అవడం ఖాయమని ఉమ అన్నారు.