YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

విశాఖలో మారుతున్న లెక్కలు

విశాఖలో మారుతున్న లెక్కలు

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

విశాఖ జిల్లాలో పదిహేను అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇందులో ఎక్కువ సీట్లు ఎవరు గెలుస్తారన్నది ప్రధాన పార్టీల మధ్య చర్చగా ఉంది. తాజాగా ఏ పార్టీకి ఆ పార్టీ అంతర్గత సర్వేలు విశాఖలో చేయించుకున్నాయి. టీడీపీ సర్వేలో ఆ పార్టీకి మెజారిటీ సీట్లు వస్తాయని తేలింది. వైసీపీకి గతం కంటే రెట్టింపు అంటే అయిదు సీట్లు మాత్రమే వస్తాయని లెక్క కట్టారు. ఇదే విషయాన్ని టీడీపీ 
సమీక్షలో పార్టీ నాయకులు చెప్పారు. ఇక వైసీపీ మాత్రం టీడీపీ సర్వేను కొట్టేస్తూ తమకు మెజారిటీ సీట్లు వస్తాయని చెప్పుకుంది. ఆ పార్టీ చేయించుకున్న సర్వేలో ఎనిమిది సీట్లు కచ్చితంగా గెలుస్తామని, మరో ఏడింట గట్టి పోటీ ఉందని, ఇందులో కనీసంగా రెండు చోట్ల విజయం సాధించగలమని ధీమా వ్యక్తం చేస్తోంది. మొత్తంగా చూసుకుంటే వైసీపీ లెక్క 10 అసెంబ్లీ సీట్లుగా ఉంది.విశాఖ రూరల్ జిల్లాలో ఆరు సీట్లు వైసీపీ గెలుచుకుంటుందని ఆ పార్టీ అంచనా వేసుకుంది. అందులో పాయకరావుపేట. చోడవరం, మాడుగుల, పాడేరు, అరకు, పెందుర్తి సీట్లలో వైసీపీ కచ్చితంగా విజయం సాధిస్తుందని పార్టీ సర్వేలో తేలిందంట. ఇక అనకాపల్లి, ఎలమంచిలి. నర్శీపట్నంలో నువ్వా నేనా అన్నట్లుగా గట్టి పోటీ ఇచ్చామని వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఇందులో రెండు సీట్లు వస్తాయని బలంగా నమ్ముతున్నారు. అంటే గతసారి కంటే ఎక్కువగానే సీట్లు రూరల్ జిల్లాలో వైసీపీకి వస్తాయని పార్టీ సర్వే లెక్క కట్టింది.గత ఎన్నికల్లో విశాఖ అర్బన్ జిల్లాలో చిత్తుగా ఓడిపోయిన వైసీపీ ఈసారి బాగానే పుంజుకుందని అంటున్నారు. భీమునిపట్నం, విశాఖ సౌత్ లలో గెలుపు గ్యారంటీ అంటున్నారు. అదే విధంగా విశాఖ నార్త్, వెస్ట్, ఈస్ట్, గాజువాకల్లో గట్టి పోటీ ఇచ్చామని, ఇందులో ఒకటి రెండు సీట్లు తమ ఖాతాలో పడతాయని భావిస్తోంది. ఈసారి వైసీపీ గాలి బలంగా వీచిందని, అందువల్ల ఇంకా సీట్లు పెరిగినా ఆశ్చర్యపోనవసరం లేదని కూడా అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే పది సీట్లకు ఎక్కడా తగ్గవని వైసీపీ ధీమాగా ఉంది. మరి ఈవీఎంలలో అసలు ఫలితాలు ఉన్నాయి. అవేం చెబుతాయో చూడాలి.

Related Posts