YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

టీడీపీకీ ఫేవరేట్ గా లేని బుకీలు

టీడీపీకీ ఫేవరేట్ గా లేని బుకీలు

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అంటూ ధీమాగా బెట్టింగ్ లు లేవు. తిరిగి అధికారంలోకి వస్తుంది అని గట్టిగా చెబుతున్న వారు కరువయ్యారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ప్రభంజనం లా కనిపించిందని మరోపక్క జనసేన సర్వే లు సైతం తేల్చేశాయి. ఇక వైసిపి సంగతి చెప్పనే అఖ్ఖర్లేదు. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ వైసిపి చేసిన ప్రచారం జనంలోకి దూసుకుపోయింది అని టిడిపి వారే అంగీకరిస్తున్నారు. అదీ గాక పోల్ మేనేజ్ మెంట్, మనీ మేనేజ్మెంట్ లలో వైసిపి, టిడిపిని మించి పోయిందని ఎన్నికల సమీక్షల్లో సైతం పసుపుదళం వాపోయింది. ఇన్ని అపశకునాల నడుమ ఓటమి భయం వెంటాడుతున్న నేపథ్యంలో అధినేతను కలిసేందుకు సైతం మంత్రులు జంకారు. అయితే అనివార్య పరిస్థితుల్లో క్యాబినెట్ భేటీ వారిని ముఖ్యమంత్రితో కలిసేలా చేసింది.క్యాబినెట్ కు ముందు పార్టీ సమీక్షలో డీలా పడ్డ మంత్రుల ముఖాలను చూసి విజయంపై ధీమాగా వున్న చంద్రబాబు దరహాసం ఆలోచనల్లో పడేసింది. డౌట్ లేదు సెంచరీ కొట్టేస్తామన్న పసుపుదళపతి భరోసాతో తమ్ముళ్లలో ధైర్యం వచ్చేసింది. అయితే తమకు ఓటమి భయానికి ప్రధాన కారణం చెప్పి అధినేతకు షాక్ ఇచ్చారు మంత్రులు. పోలింగ్ ముందు నుంచి ఈసీపై పోరాటం, ఆ తరువాత ఈవీఎం లపై అనుమానం తమ పార్టీ గ్యారంటీగా విపక్షానికి పరిమితం అన్న సందేహాలను వ్యాప్తి చెందేలా చేసిందని బాబు ముందు వారంతా బోరుమన్నారు.తమ్ముళ్ళ ఆందోళనకు తెరదించుతూ ముందుగా అనుకున్న 120 
కాకుండా 100 కు తక్కువ కాకుండా సీట్లు సాధించడం ఖాయమని తన దగ్గర లెక్కలు వారికి వివరించారట చంద్రబాబు. ఈసీపై, ఈవీఎంలపై పోరాటం వ్యూహంలో భాగంగా చేసిందని ఆయన స్పష్టం చేయడంతో బాటు వంద నియోజకవర్గాల్లో పార్టీ గెలుపును వివరించడంతో వారికి విజయంపై నమ్మకం పెరిగినట్లు టిడిపి వర్గాల్లో ప్రచారం సాగుతుంది. ఇప్పటివరకు అపజయం తప్పదన్న అంచనాల్లో వున్నవారంతా ఊపిరి పీల్చుకుని గట్టున పడతామని తిరిగి అధికారం దక్కించుకుంటామన్న సంతోషంతో క్యాబినెట్ భేటీ నుంచి వెనుతిరిగారని తెలుస్తుంది. అయితే బాబు లెక్కలు ఏ మేరకు నిజమో ఇంకో వారం ఆగితే గాని తేలదు మరి.

Related Posts