యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 21న మాక్ కౌంటింగ్ ప్రక్రియ ఉంటుందని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాంమోహన్ రావు తెలిపారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో అత్యధికంగా 185 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. నిజామాబాద్‌లో కలెక్టర్ రాంమోహన్ రావు మీడియాతో మాట్లాడారు. నిజామాబాద్ లోక్ సభ పరిధిలో 185 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నందున లెక్కింపు కాస్త ఆలసం అవుతుంది. ఈ ఎన్నికలలో M3 అనే కొత్తరకం ఈవీఎంలను ఉపయోగించారు. దీని ఫలితంగా 23న వెలువడాల్సి ఫలితం మరుసటి రోజుకి క్లారిటీగా రానుంది. నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నిజామాబాద్ జిల్లాలోని ఐదు నియోజకవర్గాలు, జగిత్యాల జిల్లాలోని రెండు నియోజకవర్గాల పరిధిలో ఉండడంతో రెండు ప్రాంతాలలోలెక్కింపు జరుగుతుందని కలెక్టర్ రాంమోహన్ రావు చెప్పారు. ఇతర జిల్లాల్లో కంటే నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు బిన్నగా ఉంటుందని లెక్కింపులో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలన్నారు. ఒక్క టేబుల్ వద్ద సమస్య ఎదురైతే మొత్తానికి సమస్య ఎదురవుతుందని లోకసభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో ఉన్నందున ఎక్కువ టైం తీసుకునే అవకాశం ఉందని చెప్పారు. ఎప్పటికప్పుడు ఈసీఐ సూచనలతో పాటుగా రిటర్నింగ్ అధికారి అబ్జర్వర్ సూచనలు పాటించాలని చెప్పారు.ఒక్కొక్క రౌండ్ కు కనీసం రెండున్నర గంటల నుండి మూడు గంటలు పట్టే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు. అందుకు గాను ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు లెక్కింపు జరుపుతామని చెప్పారు. ఈ నెల 21న మాక్ కౌంటింగ్ కోసం కావాల్సిన సామాగ్రి సిద్ధం చేశామన్నారు.