YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కిడ్ని రాకెట్ లో కొత్త విషయాలు

కిడ్ని రాకెట్ లో కొత్త విషయాలు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో: 

విశాఖలో సంచలనం సృష్టించిన కిడ్నా రాకెట్ కేసులో త్రిసభ్య కమిటీ దర్యాప్తు పూర్తి చేసింది. నాలుగు రోజుల పాటు శ్రద్ధ ఆసుపత్రిలో ముమ్మర తనిఖీలు నిర్వహించిన కమిటీ కీలక నిర్ణయాలను సేకరించింది. ఈరోజు తిసభ్య కమిటీ నివేదికను కలెక్టర్ కు అందించనుంది. మూత్రపిండాల మార్పిడిలో అవకతవకలకు పాల్పడిన శ్రద్ధా ఆసుపత్రిపై త్రిసభ్య కమిటీ విచారణ ముగిసింది. నాలుగు రోజుల నుంచి శ్రర్ధ ఆస్పత్రిలో తనిఖీలు నిర్వహించిన తిసభ్య కమిటీ విచారణ పూర్తి చేసింది. ఈ క్రమంలో కేసుకు సంబంధించి కమిటీ పలు ప్రాథమిక ఆధారాలను సేకరించింది. మరోవైపు ఇప్పటి వరకూ నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు శ్రద్ధ ఆస్పత్రి ఎండీ ప్రదీప్ ఇంకా పరారీలోనే ఉన్నారు. దీంతో ఆయన కోసం ఐదు పోలీస్ బృందాలు గాలిస్తున్నారు. ఇక ప్రదీప్ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించి కీలకమైన సమాచారం సేకరించారు. ఇక తిసభ్య కమిటీ ఇవాళ తన నివేదికను అందించనుంది. శ్రర్ధ ఆసుపత్రిలో 2012 నుంచి ఇప్పటి వరకూ మొత్తం 66 కేసులను హ్యాండిల్ చేసింది. ఇందులో 16 ఎంటీఆర్ వైద్య సేవలో చేశారు. మిగిలినవి క్యాష్ తీసుకొని చేశారు. మూత్రపిండాల మార్పిడిలో శ్రద్ధా ఆసుపత్రి యాజమాన్యం పలు అక్రమాలకు పాల్పడినట్లు ఇప్పటికే పోలీసుల విచారణలో బయటపడినట్లు సమాచారం. కిడ్నీ దాత ఒకరైతే అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు వేరుగా ఉన్నట్లు గుర్తించారు. రికార్డుల్లో ఉన్న అడ్రస్‌కు వెళ్లి పేర్లను అడిగితే అలాంటి వ్యక్తులు లేరన్న సమాధానం వస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. కిడ్నీ దాతలకు పేర్లు మార్చి, అందుకు అనుగుణంగా బోగస్‌ ఆధార్‌ కార్డులను తయారు చేసినట్లు విచారణలో తేలింది. ఇక ఈరోజు త్రిసభ్య కమిటీ తన నివేదికను కలెక్టర్ కు అందజేయనుంది. మరోవైపు పోలీసులు దీనిపై మరింత సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.

Related Posts