YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఉపాధిలో అక్రమాలకు తెర లేపారు

ఉపాధిలో అక్రమాలకు తెర లేపారు
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో: 
ఉపాధి హామీ పథకం జిల్లాలో సక్రమంగా అమలుకు నోచుకోలేదన్న విమర్శలున్నాయి.  సమస్యలను పరిష్కరించడంలో అధికారులు తీవ్ర వైఫల్యం చెందారన్న ఆరోపణలున్నాయి.ఉపాధి  పనులను సక్రమంగా చేశారా.. లేక అక్రమాలకు పాల్పడ్డారా అనే విషయంపై సోషల్‌ ఆడిట్‌ చేయడం ఉపాధి  పథకంలో ఒక నియమంగా ఉంటుంది. కానీ జిల్లాలో సోషల్‌ ఆడిట్‌పై పలు విమర్శలు వస్తున్నాయి.  ముద్దనూరులో సోషల్‌ ఆడిట్‌ సక్రమంగా జరగలేదని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లగా.. ప్రత్యేబృందంతో విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. అలాగే సొ మ్ము రికవరీ చేయడానికి అలసత్వం ప్రదర్శిస్తున్న ట్లు తెలుస్తోంది. కొంతమందినుంచి రికవరీ చేయకుండానే లోపాయికారి ఒప్పందం చేసుకుని అధికా రులు మళ్లీ విధులలో చేర్చుకున్నట్లు సమాచారం. ఉపాధిలో తిష్ట వేసిన సమస్యలను పరిష్కరించాలని డైరెక్టర్‌ రంజిత్‌ బాషాను ఉపాధి హామీ కూలీలు కోరుతున్నారు. ఎన్నో ఏళ్లుగా తిష్ట వేసిన సమస్యలను పరిష్కరించే దిశగా నేడు జరిగే  సమీక్ష సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.మజ్జిగ పంపిణీ, కూలీలకు సౌకర్యాలు, బిల్లుల చెల్లింపు, పెండింగ్‌ ఖాతాల పరిష్కారాలు, సిబ్బంది సమస్యలు తదితర అంశాలు తిష్టవేసి పరిష్కారానికి నోచుకోక కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో రోజుకు ఉపాధి  పనులకు 1.80 లక్షల మంది కూలీలు హాజరవుతున్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి.   వేసవిలో కూలీలకు వడదెబ్బ సోకకుండా ఒక్కొక్కరికి 250ఎం.ఎల్‌ మజ్జిగను  అందించాల్సి ఉంటుంది. ఇందుకుగానూ మేట్లకు మజ్జిగకు రూ.4లు, పంపిణీ చేసినందుకు ఒక్క రూపాయి ఇస్తారు.  అయితే జిల్లాలో చాలా చోట్ల మేట్లు కూలీలకు మజ్జిగ పంపిణీ చేయకుండానే పంపిణీ చేస్తున్నట్లు నమోదు చేసుకుంటున్నారు. తమ ఖాతాలలో ఆ మొత్తాన్ని జమ చేసుకుంటున్నారు. అధికారులకు తెలిసినప్పటికీ ఈ విషయం పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉపాధి కూలీలకు సంబంధించి సస్పెన్షన్‌ ఖాతాల జాబితాలో ఉన్న వారికి ఇప్పటికీ కూలీ ల సొమ్ము అందలేదు. జిల్లా వ్యాప్తంగా ఈ  ఖాతాల పరిధిలో 13,832మంది కూలీలు ఉన్నారు. దాదాపు రూ.2.26కోట్లు ఈ కూలీలకు డబ్బులు రావాల్సి ఉంది. ఆధార్‌ కార్డు బ్యాంక్‌ ఖాతాకు లింకేజీ కాకపోవడంవల్ల కూలీలకు డబ్బులు జమ కాలేదు. ఈ సమస్యను అధికారులు పరిష్కరించలేదు.కంప్యూటర్‌ ఆపరేటర్లు జాబ్‌ కార్డులు ఇచ్చేటప్పుడు వారి బ్యాంక్‌ ఖాతాకు ఆధార్‌ కార్డు, ఉపాధి హామీ జాబ్‌ కార్డు నంబర్లు సరిగా వేస్తేనే ఖాతా నమోదవుతుంది.  ఆపరేటర్ల నిర్లక్ష్యం ఉన్నా అధికారులు దగ్గరుండి చేయించకపోవడంవల్లే ఈ పరిస్థితి నెలకొంది.జిల్లాలో 795పంచాయతీలున్నాయి. ఇందులో 200గ్రామాలు వాటర్‌ షెడ్‌ కింద ఎంపికయ్యాయి. అయితే ఈ పథకం కింద ఎంపికైన గ్రామాలలో ఉపాధి కూలీలు మజ్జిగ పంపిణీకి నోచుకోలేదు. ఈ పథకానికి సంబంధించి ప్రత్యేక వెబ్‌సైట్‌ ఓపెన్‌ కాకపోవడంవల్లే ఈ పరిస్థితి వచ్చిందని అధికారులు చెబుతున్నారు.   దాదాపు 40వేల మంది కూలీలకు మజ్జిగ అందడంలేదు. 2016–17 సంవత్సరంలో మార్చి నాటికే దాదాపు రూ.60లక్షల మేర బిల్లులు రావాల్సి ఉండగా.. ఇప్పటివరకు పూర్తిస్థాయిలో బిల్లులు రాలేదు. ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధి పనులకు సంబంధించి కూలీలకు సకాలంలో కూలీ డబ్బులు అందడంలేదు. దీంతో కూలీలు పనులకు రావాలంటే మొగ్గు చూపడంలేదు.

Related Posts