యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
స్పైస్‌జెట్ మరో అంతర్జాతీయ రూట్లో సర్వీసును ప్రారంభించబోతున్నది. జూలై 5 నుంచి ముంబై నుంచి జెడ్డాకు నేరుగా విమాన సర్వీసును నడుపనున్నట్లు ప్రకటించింది. ఇదివరకే హైదరాబాద్, కోజికోడ్ నుంచి జెడ్డాకు సర్వీసులను నడుపుతున్నది. వీటితోపాటు ఈ నెల 20 నుంచి ముంబై-డెహ్రడూన్-ముంబై, ముంబై-గువాహాటి-ముంబైల మధ్య కూడా విమాన సర్వీసులను ఆరంభిస్తున్నది. ప్రత్యేక ఆఫర్ కింద ముంబై-జెడ్డాల మధ్య టిక్కెట్ ధరను రూ.12,399గా నిర్ణయించిన సంస్థ..జెడ్డా-ముంబైల మధ్య రూ.15,399గా నిర్ణయించింది. ఈ టిక్కెట్లు ఈ నెల 20 నుంచి లభించనున్నాయి.