YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

మన దేవుళ్ళు దేవతలు ఎవరు, ఎంతమంది.

 మన దేవుళ్ళు దేవతలు ఎవరు, ఎంతమంది.

 యువ్ న్యూస్ కల్చరల్ బ్యూరో:

సద్విషయ సంగ్రహము
దేవుడు, దైవము, దేవతల విషయములో గల సందేహములు.
వేద, వేదాంత, పురాణ, ఇతిహాసములను నిసితముగా
పరిసీలనవలన తెలుసుకొనగల సత్యము. 
 

ఆ నిర్గుణ నిరాకార పర బ్రహ్మ పరమాత్మ శ్రేష్ఠుడు.
ఉధ్భవమైన వన్నీ ఆ పరబ్రహ్మము లోని పావు భాగము మాత్రమే!
ఆయన ముప్పాతిక భాగము వినాశములేని గగనంలో ఉన్నది.
సృష్టి కార్యమను మహా యజ్ఞ నిర్వహణకొరకు, ఆ పరమాత్మ స్వ సంకల్పమువలన ప్రభవించిన వారే ఈదేవతలందరు.
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరాదులందరూ రూప నామాదులతో , చతుర్దశ భువనములందు వ్యాప్తి చెందియున్నారు.
ఆ నిరాకార, నిర్గుణ పరబ్రహ్మమునే నారాయణుడని, ఈశ్వరుడని, పరాశక్తియని
వివిధనాముల తో మనము,పూజించు చున్నాము.ఇంతవరక నిన్నటి విశ్లేషణలో ఉన్నది.
సనాతన వేద సాహిత్యమునందు ( వేదమంత్రములందు) పంచభూతములకు
అధి దేతల నామములు, విష్ణు, రుద్ర నామములు, ఇంద్రు ని వర్ణించినారు.
తదుపరి, అరణ్యకములందు, పురాణ ఇతిహాసములందు, అనేకములైన దేవతల నామములు, వారి ఉత్పత్తి, కార్యము, కాలము,(అస్థిత్వము) వివరింపబడినది. 
సృష్టి, స్థితి, లయము లను ఈకార్యము లు నిరంతరము కొనసాగునవి.
ఒకే  భగవంతుని యొక్కస్థితిని మూడు రూపములు గా విభజన జరిగినదని తెలియవలెను. అ కార, ఉ కార, మ కారములతో, ఓం కారము  ఏర్పడినవిధముగా ,ఈశబ్ద రూప  పరమాత్మయే  అది మూలమని ఋషులు నిర్వచించినారు.  అందుకే సగుణో పాసనలో సమస్త దేవతలకు  ఆదియందు ఓం కారము చేర్చుచున్నాము.
బ్రహ్మ సృష్టి కార్యమును, విష్ణువు ( స్థితి) పాలన పోషణ కార్యమును, శివుడు లయకార్యమును, నిర్వహించు ప్రధాన దేవతలు.
ఈ దేవతలయొక్క  ఇఛ్ఛ యే క్రియాశక్తులుగా రూపము ధరించి  వారి దేవేరులైనారు.వారి వివరములు.
                    వీరే ప్రధాన దేవతలు   
    బ్రహ్మ+ సరస్వతి. నారాయణుడు+ లక్ష్మి. శివుడు(రుద్రుడు) + పార్వతి.
బ్రహ్మ వలన ప్రజాపతులు, ఋషులు, ఇతర దేవతలు  సృష్ఠింపబడినారు
తదుపరి పాలన కార్యమునిర్వహించు నారాయణుడు( విష్ణువు) కల్పాదిగా, అనేక అవతారములు ధరించినవిధము, మనకు అష్టాదశ పురాణములలో విశదమగుచున్నది. అట్టి  అవతారములలో అత్యంత ప్రాముఖ్యముకలిగి, కలియుమందు, సమస్త ఆ స్తిక జనులచే పూజలనందుకొనుచున్న, దైవములు
శ్రీరాముడు, శ్రీ కృష్ణుడు.

Related Posts