YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

గాంధీ మార్గమే అనుచరణీయం

గాంధీ మార్గమే అనుచరణీయం

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

జాతిపిత మహాత్మా గాంధీ గురించి గత కొన్ని రోజులుగా చాలా చర్చ నడుస్తోంది. దీనికి ప్రధాన కారణం నటుడు కమల్ హాసన్, బీజేపీ లోక్‌సభ అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞా సింగ్‌. వీరు చేసిన వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా పెద్ద దుమారం చెలరేగింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చూస్తే తొలి టెర్రరిస్ట్ నాథురామ్‌ గాడ్సే అని కమల్ హాసన్ అంటే.. లేదు నాథురామ్ గాడ్సే దేశభక్తుడంటూ సాధ్వి కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. గాంధీ-గాడ్సే అంశంపై ఇప్పుడు తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్‌ అధినేత ఆనంద్‌ మహీంద్రా కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘75 ఏళ్లుగా భారతదేశం మహాత్ముడి జన్మభూమిగా ఉంది. ప్రపంచం నైతికతను కొల్పోయినప్పుడు మన దేశమే ముందుండి దారి చూపుతుంది. ప్రపంచం మనల్ని పేదవారిగా చూస్తుంటే.. బాపు ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందికి ఆదర్శంగా నిలిచి మనల్ని ఐశ్వర్యవంతుల్ని చేశారు. కొన్ని విషయాలు పవిత్రంగానే ఉండాలి. లేదంటే తాలిబన్లుగా మారి మనకోసం మనమే ఏర్పాటు చేసుకున్న విలువల్ని నాశనం చేసుకుంటాం’ అని ట్వీట్‌ చేశారు. ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. జాతిపిత గాంధీపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో సమాజానికి సరైన సందేశం ఇచ్చారని కామెంట్‌ చేస్తున్నారు. ఒక పారిశ్రామికవేత్త ఇలా ధైర్ఘ్యంగా మాట్లాడటం చాలా అరుదని ఆనంద్ మహీంద్రాను పొగడ్తలతో ముంచేస్తున్నారు. 

Related Posts