YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రాహుల్ గాంధీ పదవీపై గులాం నబీ ఆజాద్ కామెంట్స్

రాహుల్ గాంధీ పదవీపై  గులాం నబీ ఆజాద్ కామెంట్స్

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

రాహుల్ గాంధీకి ప్రధాని పదవిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ మాట మార్చారు. బీజేపీని గద్దె దించడమే తమ ముఖ్య లక్ష్యమని.. ప్రధాని పదవిపై తమకు పెద్దగా ఆశలు లేవని గురువారం వ్యాఖ్యానించిన ఆజాద్‌ తాజాగా అందుకు పూర్తి విరుద్ధంగా మాట్లాడారు. దేశంలో సుదీర్ఘ చరిత్ర ఉన్న అతిపెద్ద పార్టీ తమదేనని.. తమకే అవకాశం ఇవ్వాలని పేర్కొన్నారు. కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం కావాలంటే కాంగ్రెస్‌ పార్టీకే మద్దతు ఇవ్వాలన్నారు. ‘కాంగ్రెస్‌ ప్రధాని పదవిపై ఆసక్తిగా లేదు అన్న వార్తల్లో నిజం లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీజేపీని గద్దె దించడమే అన్ని పార్టీలకు ప్రధాన లక్ష్యం కావాలి. ఎన్నికలు జరుగుతున్న సమయంలో మనలో మనమే ప్రధాని పదవి కోసం ఘర్షణ పడటం అంత మంచిది కాదనిని నేను చెబుతూ వస్తున్నా. సంప్రదింపుల ద్వారా ఈ అంశాన్ని పరిష్కరించుకోవాలి’ అని ఆజాద్‌ అన్నారు. పరోక్షంగా కాంగ్రెస్‌ నేతృత్వంలోనే ప్రభుత్వ ఏర్పాటు జరగాలని ఆజాద్ అభిప్రాయపడ్డారు. ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్సే అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని.. 273 సీట్లు కచ్చితంగా గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో తమ ముఖ్య లక్ష్యం బీజేపీని గద్దె దించడమేనని.. ప్రధాని పదవిపై తమకు పెద్దగా ఆసక్తి లేదని ఆజాద్‌ గురువారం వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ కాకుండా మరెవరినైనా ప్రధాని పదవికి ప్రతిపాదించినా సహకరించడానికి సిద్ధం అన్నట్లు సంకేతాలిచ్చారు. అన్ని పార్టీలు కలిసి నిర్ణయిస్తే నేతృత్వం వహించడానికి కాంగ్రెస్‌ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. పార్టీలన్నీ కలిసి తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. ఆజాద్ వ్యాఖ్యలను పార్టీ నేతలు వ్యతిరేకించడంతో తాజాగా ఆయన మాట మార్చినట్లు తెలుస్తోంది.

Related Posts