YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మేము అడిగితే స్పందించలేదు ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న

మేము అడిగితే స్పందించలేదు ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
భారతదేశం లో ఎన్నికల కమిషన్ బిజేపి కమిషన్ కా మారిపోయింది. ఒకప్పుడు స్వతంత్ర ప్రతిపత్తితో నిబంధనల మేరకు వ్యవహరించేది. అధికారంలో ఎవరు ఉన్నా పార్టీలతో సంబంధం లేకుండా ఎన్నికలు నిర్వహించేది. రీ పోలింగ్ కోసం మేము రాష్ట్ర ఎన్నికల అధికారిని కలిస్తే స్పందించలేదని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. శుక్రవారం అయన మీడియాతో మాట్లాడారు. ఎ2 ముద్దాయి గా ఉన్న విజయసాయి రెడ్డి డిల్లీలో ప్రధాని కార్యాలయం ద్వారా ఎన్నికల సంఘాన్ని నడిపిస్తున్నారు. విజయసాయి రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెల్ల కాగితం మీద ఫిర్యాదు ఇస్తే ఎన్నికల సంఘం వెంటనే స్పందించింది. చంద్రగిరిలో ఓటమి భయంతో వైసిపి పిఎంఒ ద్వారా ఎన్నికల సంఘానికి సిఫార్సు చేయించారు. పోలింగ్ జరిగిన నలభై రోజుల తర్వాత రీపోలింగ్ నిర్వహించడం దేశ చరిత్రలో తొలిసారని అన్నారు. బిజేపి యేతర పార్టీలను ఏదో విధంగా ఓడించాలని మోడి అనేక కుట్రలు చేస్తున్నారు. ఎపి సియస్ యల్వీ సుబ్రహ్మణ్యం , ద్వివేదీ లు పై నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఐదు కేంద్రాలలో రీపోలింగ్ కు ఆదేశించారు. మేము 19 చోట్ల రీపోలింగ్ పెట్టాలని మేము అడిగితే ఇంతవరకు స్పందించలేదు. ఎన్ని కుట్రలు చేసైనా, డబ్బు పంచైనా ఆ ఐదు కేంద్రాలలో తమకు అనుకూలంగా మలచుకునేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. యల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశాలతో రీపోలింగ్ చేస్తున్నామని చెప్పడం సిగ్గుచేటు. కేసుల నుంచి తప్పించాలని జగన్ మోడి కాళ్ల పై పడ్డాడు. మోడి తన అధికారాన్ని ఉపయోగించి ఎపి లో అనేక కుట్రలు చేస్తున్నారు. మోడి అనే మహిసురుడి పాలన మే 23 తర్వాత రాజకీయం గా  అంతం అవడం ఖాయం. చంద్రబాబు బిజేపి నుంచి బయటకు రాగానే మోడి పతనం ప్రారంభమైందని అన్నారు. చంద్రబాబు తెలుగు ప్రజల బ్రహ్మాస్త్రం లాంటి వాడు. మోడి మోసాలను వెలుగులోకి తెచ్చిన ఏకైక నాయకుడు చంద్రబాబు. చంద్రబాబు  అస్త్రాలు సంధిస్తే... ప్రజలు తమ ఓట్లతో మోడి ని ఇంటికి సాగనంపుతున్నారు. ఫలితాలు వచ్చాక ప్రజలకు  కూడా వాస్తవాలు అర్దమవుతాయి. సియస్ సుబ్రహ్మణ్యం ఇప్పటికైనా స్పందించి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. మేము కోరిన విధంగా 19 చోట్ల కూడా రీపోలింగ్ చేపట్టాలని అయన కోరారు.

Related Posts