YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వాహానాలతో ఉక్కిరిబిక్కిరి

వాహానాలతో ఉక్కిరిబిక్కిరి

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

ఒంగోలు: జిల్లాలో వాహనాల రద్దీ రోజురోజుకు తీవ్రమవుతుంది. ఫలితంగా వాతావరణంలో ధూళికణాలు భారీగా పేరుకుపోతున్నాయి. ట్రాఫిక్‌లో కళ్లకు ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకుండా వెళ్ళేవాహణదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఊపిరితిత్తుల వ్యాధులకు గురవుతున్నారు. ఏకాగ్రత కోల్పవడం.  నేరుగా వచ్చిపడే దుమ్ము కణాల ధాటికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. కంటి నుంచి నీరు కారడం, మంటపుట్టడం, ఎర్రబడటం వంటి వాటితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై ప్రయాణించే జిల్లావాసులు ఈ తరహా సమస్యలతో నేత్ర వైద్యులను సంపాదిస్తున్నారు. ఇటీవల ప్రయివేటు సంస్థ సర్వేలో ఈ విషయం స్పష్టమైంది. జిల్లాలో మొత్తం ద్విచక్ర వాహనాలు 5.5లక్షలు ఉన్నాయి. ఆటోలు, కార్లు మొత్తం 4 లక్షల వాహనాలు ఉన్నాయి. ఇవికాక జిల్లాలో మరో 15వేలు వాహనాలు బయటనుండి వస్తాయి. వీటికి తోడు జిల్లాలో అక్కడక్కడా రోడ్డు పనులు జరుగుతుంటాయి. ఫలితంగా వాతావరణంలో గాలి కాలుష్యం తీవ్రమవుతుంది. పీఎం 2.5ధూళికణాలు ఘనపు మీటర్‌ గాలిలో - 40 మైక్రోగ్రాములు, పీఎం-10 ధూళికణాలు -60 మైక్రోగ్రాములు మించి వుంటే ప్రమాదమే. జిల్లాలో ప్రధాన పట్టణాలైన తిరుపతి, చిత్తూరు, మదనపల్లి, పుంగనూరు, కుప్పం, పలమనేరు, పీలేరు, పుత్తూరు, సత్యవేడు తదితర ప్రాంతాల్లో కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నాయి.విచక్షణా శక్తి దెబ్బత్తినడం వంటి మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీనికితోడు ఎక్కువ సమయం ఏసీ గదుల్లో గడిపేవారికి కూడా కళ్ళల్లో తడి అరిపోవడం వంటి సమస్యలు పెరుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ప్రయివేట్‌ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఇటీవల చాలా మంది కంటి పరీక్షలు చేపట్టారు. ఇందులో జిల్లాలోని మొత్తం వాహనదారుల్లో దాదాపు 12 శాతం మందిలో కంటి దురద, నీరు కారడం, ఎర్రబడటం వంటి లక్షణాలు ఎక్కువగా గుర్తించారు. గాలి, వాతావరణం కలుష్యమే కారణంగా ఇవి వచ్చినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఇందులో 20- 40 ఏళ్ల మధ్య వయసు వారే అధికంగా ఉన్నారు. ముఖ్యంగా ఉద్యోగ బాధ్యతలు, ఇతర పనులతో నిత్యం ట్రాఫిక్‌లో తిరిగేవారు నేత్ర సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారు. 

Related Posts