యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ఒకపక్క నిరాశ్రుయులు మరో పక్క అనాథులు, ఎక్కడ పడుకోవాలో తెలియక అల్లాడుతున్నారు. వాళ్ల జీవన పరిస్థితిలు అంతత మాత్రం. నగరంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాత్రి బస పథకం ఎక్కడా కనిపిచడం లేదు. రోజూ వందలాది మంది అనాథలు ఆశ్రయం లేక రోడ్డుపై అష్టాకష్టాలు పడుతున్నా ఎవ్వరూ పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.నగరంలో 100 మందికి పైగా అభాగ్యులు, అనాథలు ఉన్నారు. వీరు వివిధ జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల వారు ఇలా అందురు కలిపి 100 మందిపైగా ఉన్నారు. వీరి గురించి నగర పాలక సంస్థ అధికారులు పట్టించుకోవడం లేదు. వర్షాలు పడితే వాళ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రాత్రి పూట పడుకునే అందుకు జానేడు స్థలం లేక్క చాల ఇబ్బందు పుడుతున్నారు. అధికారులు అలాంటి వారిని గుర్తించి వారికి రాత్రి బస కేంద్రాలకు ఆశ్రయం కల్పించాలి. కేంద్ర ప్రభుత్వం నింబధనల ప్రకారం ప్రతి50 మందికి ఒక సెంటర్‌ను ఏర్పాటు చేయాలి. కానీ గతేడాది జిల్లా యంత్రాగం కేవలం ఒక్కటి మాత్రమే అనుమతిచింది. రెండున్నరసంవత్సరాల క్రితం పట్నాలు వీధి సమీపంలోని నగర పాలక సంస్థ పాఠశాల పక్కన రాత్రి బస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ 50మంది నిరాశ్రయులకు బస ఏర్పాటు చేశారు. ఒక్కొక్కరికి రోజుకు రూ.50 లెక్కన కేటాయించి, భోజన వసతి కల్పించాల్సి ఉంది. అయితే రోజుకు 20 నుంచి 30 మంది మాత్రమే ఇక్కడికి వస్తున్నట్టు తెలుస్తుంది. అందరికీ హాజరు వేసి సంబంధిత మొత్తాన్ని నిర్వహకులు నొక్కేస్తున్నారు.ప్రతి ఏటా వలసబాట పట్టేవారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. ఎవరూ లేక కొందరు. అందురూ ఉన్నా ఆశ్రయం పొందలేక మరి కొందరు. వీరు రాత్రి పుట పడుకోవడానికి జానేడు స్థలం లేక అష్టకష్టాలు పడుతుంటారు. అలాంటి వారు మనకు నగరంలో అడుగడుగున కనిపిస్తుంటారు. ఇటాంటి వారిని గుర్తించి ఆశ్రమం కల్పించే సదుద్ధేశంతో కేంద్ర ప్రభుత్వం నాలుగు ఏళ్ల క్రితం తీసుకొచ్చిన రాత్రి బస పథకం నగరంలో నామమాత్రంగా అమలవుతోంది. సూమారు 100 మందికి పైగా అనాథలు పుట్ పాత్‌లపై అల్లాడుతున్నా ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు.ఒకొక్క బస సెంటర్‌కు కేంద్రం రూ. 6లక్షలు విడుదల చేస్తుంది. ఇందులో కేంద్రం వాటా ముండొంతులు, రాష్ట్రం వాటా ఒక వంతు ఉంటుంది. గత ఏడాది కేంద్రం వాటాగా రాష్ట్రానికి రూ. వెయ్యి కోట్లు విడుదల చేసింది. ఈ నిధులకు నాలుగింటిలో ఒకటో వంతు జతచేసి ఆయా నగరాల్లో ఏర్పాటు చేసిన, చేయాల్సిన రాత్రి బస కేంద్రాల్లో వసతులు సమకుకర్చాల్సింది. అయితే పాలకుల అలసత్వం, అధికారుల ఉదాసీనత వల్ల ఈ నిధులు పక్కదారిపడుతున్నట్లు తెలస్తోంది.ప్రతి రాత్రి బస సెంటర్‌లో పరుపులు, ఫ్యాన్లు, మంచినీరు, మరుగుదొడ్లు వంటవి కల్పించాలి. రాత్రి పూట హాజరు వేయాలి. మంచి పౌష్టికాహారం అందించాలి. అభాగ్యలైనవారు ఉంటే వారని బస కేంద్రానికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయంచాలి. ఉపాధి అవకాశాలు కల్ఫించాలి. ఇందులో ఎవరైన మరణిస్తే సిబ్బందే అంతక్రియలు చేయాలి. కానీ స్థానిక కేంద్రంలో ఇవేవీ అమలు కావడంలేదు.