ముందు చెప్పినట్టుగానే దక్షిణాది సినీ నిర్మాతల మండలి జాక్ మార్చ్ 2 నుంచి అంటే ఈ రోజు నుంచి
సినిమా థియేటర్లు బంద్ పాటిస్తున్నాయి. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు వీపీఎఫ్ ఏ మాత్రం తగ్గించకపోవడంతో తప్పని సరి పరిస్థితిలో బంద్ పాటించాల్సి వస్తుంది అని ప్రొడ్యూసర్ సురేష్ బాబు నిన్న మీడియా కి వివరించారు. హైదరాబాద్ తో సహా అన్ని జిల్లాల థియేటర్ యజమానులు స్వచ్చందంగా బంద్ పాటిస్తునట్టు సమాచారం.ఇక అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా అన్ని సినిమా థియేటర్లు బంద్ లో పాల్గొంటున్నాయి.