యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
గ్రామీణ ప్రాంతంలో పారా మెడికల్ సర్వీసెస్ యొక్క ఆవశ్యకత వాటిలో గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం గురించి శ్రీమతి పూనం మాలకొండయ్య గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ హెల్త్ గారు నైపుణ్య సంస్థ అధికారులతో 17.5.19 నాడు ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఎపిఎస్‌ఎస్‌డిసి ఆధ్వర్యంలో పలు పారామెడికల్, మెడికల్ విభాగంలో ఇస్తున్న నైపుణ్య శిక్షణ గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. గ్రామీణ మరియు పట్టణ పరిసర ప్రాంతాల్లో పారామెడికల్ విభాగాన్ని మరింత అభివృద్ధి చేసే అశంపై ఎపిఎస్‌ఎస్‌డిసి అధికారుల కు అనేక సూచనలు ఇచ్చారు.రాబోయే రోజుల్లో గ్రామీణ ప్రాంతల్లో వైద్యసేవలను మరింత విస్తృతపరుస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో ఒబెసిటీ పేషెంట్ల సంఖ్య 33శాతం పెరిగిందని.. పట్టణ ప్రాంతాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఈ సంఖ్య పెరుగుతోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్యసేవ కింద 800కు పైగా నెట్ వర్క్ హాస్పటల్స్ ఉన్నాయని చెప్పారు. అయితే చాలా ప్రాంతాల్లో నిపుణులైన ఎక్స్ రే టెక్నీషియన్స్ సహా ఇతర విభాగాలకు అవసరమైన నిపుణులు దొరకడం లేదనిఆయా సంస్థలతో ఎపిఎస్‌ఎస్‌డిసి కలిసి పనిచేస్తే బాగుంటుందని ఆమె సూచించారు.రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 45వేల మంది ఆశా వర్కర్లు పనిచేస్తున్నారని.. వారికి మరింత నైపుణ్య శిక్షణ ఇవ్వడం ద్వారా వైద్యసేవలు మరింత మెరుగవుతాయన్నారు. ఈవిషయంలో ఎపిఎస్‌ఎస్‌డిసి శిక్షణ అవసరమని భావిస్తున్నట్టు పూనం మాలకొండయ్య చెప్పారు. పారా మెడికల్ కోర్సుల్లోనూ ఎపిఎస్‌ఎస్‌డిసి శిక్షణ ఇచ్చే అంశాన్ని పారా మెడికల్ బోర్డు అధికారులతో చర్చించాల్సిందిగా ఆమె సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలోనే కాకుండా విదేశాల్లోనూ ఫిజియోథెరపీ, అక్యుపేషనల్, డయాలసిస్ కోర్సులకు మంచి డిమాండ్ ఉందన్నారు. ముఖ్యంగా మహిళలకు ఫిజియోథెరపీ విభాగంలో ఉపాధి అవకాశాలు భారీగా ఉన్నట్టు ఆమె చెప్పారు. నర్సింగ్ కు విదేశాల్లోనూ డిమాండ్ ఉందన్నారు. అలాగే వృద్ధుల, క్యాన్సర్ పేషెంట్ల సంరక్షణ విషయంలో హోమ్ కేర్ అసిస్టెంట్స్ కి మరింత డిమాండ్ ఉందని తెలిపారు అధికారులు పేరా మెడికల్ కోర్సుల్లో డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ మరియు డైరెక్టర్ మెడికల్ గార్లతో సంప్రదింపులు చేసి పారామెడికల్ నైపుణ్య శిక్షణ విషయంలో తగు చర్యలు తీసుకోవలసిందిగా సూచించారు. హెల్త్ డిపార్ట్మెంట్ సహకారంతో రాబోవు కాలంలో గ్రామీణ ప్రాంతంలో లో హెల్త్ వర్కర్ ల యొక్క నైపుణ్య శిక్షణ విషయంలో అలాగే ఇతర పేరా మెడికల్ సర్వీసెస్ నైపుణ్య విషయంలో కూడా తగు చర్యలు ఏపీ ఎస్ ఎస్ డి సి చేపట్టనుంది