యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
చంద్రగిరి నియోజకవర్గంలో ఆదివారం మొత్తం 7పోలింగ్ బూత్ లలో రీ పోలింగ్ నిర్వహిస్తునర్నామని కలెక్టర్ ప్రద్యుమ్న వివరించారు. తొలిసారి ఐదు స్థానాలు రీపోలింగ్ ఉంటుందనిఅనుకున్నప్పటికీ, తాజాగా వెంకటరామపురం కుప్పం బాదూరు పోలింగ్ బూత్ లలో కూడా రీపోలింగ్ నిర్వహించాలని నిర్ణయించామని అయన అన్నారు. శనివారం అయన మీడియాతోమాట్లాడారు. ఏడు స్థానాల్లో వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఒక్కొక్క పోలింగ్ బూత్ లో 60 మంది ఎన్నికల విధుల్లో ఉంటారు. ప్రతిపోలింగ్ బూత్ వద్ద ఒక డిప్యూటీ కలెక్టర్
స్థాయి అధికారి ఎన్నికల పర్యవేక్షణ చేస్తుంటారని కలెక్టర్ వివరించారు. ఒక్కో పోలింగ్ బూత్ వద్ద 250 మంది పోలీసులు భద్రత చర్యలు చేస్తుంటారు. నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణలో రీపోలింగ్ జరుగుతుంది. ప్రజలెవరూ భయపడకుండా నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని అయన అన్నారు. ఇరు పార్టీ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలకు కలెక్టర్ హెచ్చరికలు జారీ చేసారు. రీపోలింగ్ జరిగే ప్రాంతాల్లో ఈ మాత్రం తోక జాడించినా, అల్లర్లు, ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించినా కఠినాతి కఠిన చర్యలు ఉంటాయని అయన అన్నారు.