YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సీఈసీని కలిసిన వైకాపా నేతలు

 సీఈసీని కలిసిన వైకాపా నేతలు

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

కేంద్ర ఎన్నికల సంఘాన్ని వైకాపా నేతల బృందం శనివారం కలిసింది. చిత్తూరు జిల్లా చంద్రగిరి లో అధికార తేదేపా నేతలు ఆరాచకాలు చేసారని ఒక వినతిపత్రం సమర్పించింది. సీఈసీకి కలిసిన
వారిలో పార్టీ సీనియర్ నేతలు  మేకపాటి రాజమోహన్ రెడ్డి,  వి. విజయసాయిరెడ్డి ఇతరులు వున్నారు.  తరువాత వారు మీడియాతో మాట్లాడారు.   ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గమైన చంద్రగిరిలో చేసిన అరాచకాలను సీఈసీ దృష్టికి తీసుకువెళ్ళాం. తన పేషీలో పనిచేసిన వ్యక్తిని చంద్రబాబు చిత్తూరు జిల్లా కలెక్టర్ గా నియమించి.. కలెక్టర్ ప్రద్యుమ్నతో తెలుగుదేశం నేతలు కుమ్మక్కై  చంద్రగిరి నియోజకవర్గంలో దళితులను పోలింగ్ కు రానివ్వకుండా  అడ్డుకొన్నారని విజయసాయి రెడ్డి అన్నారు.  చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తులు 7 పోలింగ్ బూత్ ల్లో రిగ్గింగ్ కు పాల్పడ్డారు. పోలింగ్ ఆఫీసర్ ను కూడా జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న బెదిరించారు. అయితే అక్కడ ఎటువంటి రిగ్గింగ్ జరగలేదని ప్రాణభయం పెట్టి పోలింగ్ ఆఫీసర్ తో నివేదిక ఇప్పించారు. రిగ్గింగ్ పై సీసీ ఫుటేజీని పరిశీలించాలని మేం కోరినా కలెక్టర్ పట్టించుకోలేదు. దీనిపై పోలింగ్ మరుసటి రోజే  మా పార్టీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఏప్రిల్ 12న ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దానిని అంతటితో వదిలిపెట్టకుండా.. సాక్ష్యాధారాలతో సహా.. సీఈవోకు, ఢిల్లీలో సీఈసీకి వినతిపత్రాలు ఇచ్చాం. ఆ తర్వాతనే ఎన్నికల సంఘం 5 పోలింగ్ బూత్ ల్లో రీపోలింగ్ కు ఆదేశించటం జరిగింది. వాస్తవానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరింది 7 పోలింగ్ బూత్ ల్లో రీపోలింగ్ నిర్వహించాలని కోరామని అన్నారు.  ఎన్నికల కమిషన్ రీపోలింగ్ కు ఆదేశించిన ఆ 5 పోలింగ్ బూత్ లల్లో పోలైన ఓట్లు గమనిస్తే.. 2014 ఎన్నికల్లోనూ ఆ 5 పోలింగ్ బూత్ ల్లో టీడీపీకే మెజార్టీ ఓట్లు పడ్డాయి. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకటి.. రెండు ఓట్లు మాత్రమే వచ్చాయి. ఒక ప్రణాళిక ప్రకారమే.. గత ఎన్నికల నుంచి.. నిన్నటి 2019 ఎన్నికల వరకూ టీడీపీ రిగ్గింగ్ కు పాల్పడుతోందని అయన విమర్శించారు.  టీడీపీతో కుమ్మక్కై దళితుల ఓటు హక్కును అడ్డుకున్న జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీఈసీ దగ్గర డిమాండ్ చేశామని అన్నారు.   దళితులుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా.. అని మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు. ఆయన మార్గదర్శకంలోనే టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అయితే ఏకంగా దళితులపై దాడులు, దౌర్జన్యాలు చేశారు. ఈవిధమైన పాలనతో దళిత ద్రోహిగా చంద్రబాబు నిలిచారు.  పోలింగ్ ప్రారంభానికి ముందు మాక్ పోలింగ్ జరుగుతుంది. మాక్ పోలింగ్ సందర్భంలో వీవీ ప్యాట్ లలో నమోదైన స్లిప్పులు తొలగించకుండా.. వీవీ ప్యాట్ లలో స్లిప్పులు లెక్కిస్తే.. కచ్చితంగా వ్యత్యాసం కనిపిస్తోంది. దీనిని అడ్డం పెట్టుకుని టీడీపీ అల్లర్లు సృష్టించే అవకాశం ఉంది. ఈవీఎంలు, వీవీ ప్యాట్ లలో లెక్కింపులో వ్యత్యాసాలు రాకుండా.. పారదర్శకుంగా ఫలితాలు వచ్చేవిధంగా  అధికారులకు మార్గదర్శకాలు జారీ చేయాలని ఎన్నికల కమిషన్ ను కోరామని అన్నారు.  చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్నకు లైవ్ డిటెక్టివ్ పరీక్ష చేస్తే చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన పోలింగ్ అక్రమాలన్నీ బయటకు వస్తాయి.   సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఎన్నికల సందర్భంగా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నాడు. మేం పంపే ప్రతి ఫిర్యాదునూ ఆయనకూ ఒక కాపీ పంపిస్తున్నాం. ఇందులో తప్పులేదు. వీరంతా ఎన్నికల కమిషన్ పరిధిలోకే వస్తారు.  ఎన్నికల కమిషన్ అనేది రాజ్యాంగ ప్రతిపత్తి కలిగిన సంస్థ. సీఎం రమేష్ లాంటి బుర్ర లేని వ్యక్తి దానిపై ఇన్వెస్టిగేషన్ చేస్తామనడం హాస్యాస్పదమని అన్నారు.
దేశ రాజకీయాల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాత్ర ఏమిటన్నది ఫలితాల తర్వాత  పార్టీ అధినేత జగన్  అందరితో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయానికి పార్టీలో ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉంటారని అయన స్పష్టం చేసారు.

Related Posts