YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆరు రోజుల్లో 5.10 ల‌క్ష‌ల మందికి శ్రీ‌వారి ద‌ర్శ‌నం

ఆరు రోజుల్లో 5.10 ల‌క్ష‌ల మందికి శ్రీ‌వారి ద‌ర్శ‌నం

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

వేసవి సెలవుల నేపథ్యంలో క‌లియుగ ప్ర‌త్య‌క్షదైవం తిరుమ‌ల శ్రీవేంక‌టేశ్వ‌ర‌స్వామి ద‌ర్శనం కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో సప్తగిరులు కిటకిటలాడుతున్నాయి. గత ఆరు రోజుల్లోనే శ్రీవారిని 5.10 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారంటే రద్దీ ఎంతలా ఉందో తెలుస్తోంది. తిరుమలకు విచ్చేసిన భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా గ‌త ఆరు రోజుల్లో 5.10 ల‌క్ష‌ల మందికి సంతృప్తిక‌రంగా శ్రీ‌వారి ద‌ర్శ‌నం క‌ల్పించిన‌ట్లు టీటీడీ ఇన్‌చార్జ్ జెఈవో ల‌క్ష్మీకాంతం తెలిపారు. శుక్ర‌వారం సాయంత్రం తిరుమ‌ల‌లోని ప‌లు ప్రాంతాల‌లో త‌నిఖీలు నిర్వ‌హించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ... వేస‌వి సెల‌వులు కావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్య‌లో వస్తున్నారని అన్నారు. తిరుమ‌ల‌కు విచ్చేసిన భ‌క్తులంద‌రికీ అన్న‌ప్ర‌సాదాలు, వ‌స‌తి, త‌ల‌నీలాల స‌మ‌ర్ప‌ణ‌, ద‌ర్శ‌నం, ల‌డ్డూ ప్ర‌సాదాలు త‌దిత‌ర సౌక‌ర్యాల‌ను క‌ల్పించేందుకు టీటీడీలో అన్ని విభాగాలు స‌మ‌న్వ‌యంతో ప‌ని చేసి విశేష సేవ‌లందిచాయ‌న్నారు. ఈ సంద‌ర్భంగా టీటీడీ అధికారులు, సిబ్బంది, శ్రీ‌వారిసేవ‌కులుకు ఆయన కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. అంత‌కుముందు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-2లో తనిఖీలు నిర్వహించి, దర్శనం, లడ్డ టోకెన్ల పరిశీలించారు. భక్తులందరికీ టీ, కాఫీ, తాగునీరు, అల్పాహారం, అన్న‌ ప్ర‌సాదాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లలో భక్తులకు సులువుగా అర్థమయ్యేలా సూచిక బోర్డులు ఏర్పాటుచేయాలని ఆదేశించారు. కంపార్టుమెంట్ల‌లోని భ‌క్తుల‌కు అందిస్తున్న సౌక‌ర్యాల‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ సౌక‌ర్యాల‌పై భక్తులు సంతృప్తి వ్య‌క్తం చేశారు. తిరుమ‌ల‌లో ప‌చ్చ‌ద‌నం పెంపొందించ‌డంలో భాగంగా బ‌యోవాల్‌ను ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు. టీటీడీ పరిధిలోని తిరుప‌తి గోవింద‌రాజ‌స్వ‌ామి ఆల‌యం, తిరుచానూరు ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యం, శ్రీ‌నివాస మంగాపురంలోని శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి ఆల‌యం, ఇత‌ర అనుబంధ ఆల‌యాల ప్రాశిస్త్యం భ‌క్తుల‌కు తెలిసేలా ఎస్వీబీసీలో నాలుగు నిమిషాలు వ్య‌వ‌ధి గ‌ల చిన్న వీడియోలను కంపార్టుమెంట్ల‌లోని టీవీల‌లో ప్ర‌సారం చేస్తామని వివరించారు.

Related Posts