సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కెరీర్లో 25వ చిత్రంగా తెరకెక్కిన ‘మహర్షి’ రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. మిక్స్‌డ్ రివ్యూస్ వచ్చినప్పటికీ వాటినన్నింటినీ తట్టుకుని బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లు రాబడుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో స్టడీగా కలెక్షన్లు రాబడుతోంది. స్టూడెంట్‌గా, ఓ కంపెనీకి సీఈవోగా, ఫ్రెండ్ కోసం ఎంతకైనా తెగించే వ్యక్తిగా మూడు షేడ్స్ ఉన్న పాత్రల్లో మహేశ్ ఇరగదీశాడు. ఇప్పటికే రూ.100కోట్ల గ్రాస్ కలెక్షన్లను దాటేసిన ఈ చిత్రం మహేశ్ కెరీర్లోనే అత్యధిక గ్రాస్ కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. మూడోవారంలోనూ స్టడీ కలెక్షన్లతో దూసుకుపోతున్న ‘మహర్షి’ తాజాగా ‘రంగస్థలం’ రికార్డుపై కన్నేశాడు. రామ్‌చరణ్ కెరీర్లోనే సూపర్‌హిట్‌గా నిలిచిన ‘రంగస్థలం’ నైజాం ఏరియాలో రూ.27.76కోట్లు షేర్ రాబట్టింది. నైజాంలో గురువారం రూ.84లక్షలు రాబట్టిన ‘మహర్షి’ ఓవరాల్ కలెక్షన్లు రూ.22.05కి చేరాయి. మహేశ్-కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన శ్రీమంతుడు ఈ ఏరియాలో రూ.22.32కోట్ల షేర్ రాబట్టి ఆయన కెరీర్లోనే టాప్‌గా నిలిచింది. ఆ రికార్డును ఈజీగా దాటేయనున్న ‘మహర్షి’ మరో వారంలో రంగస్థలం రికార్డును కొల్లగొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. నైజాం ఏరియాలో బాహుబలి, బాహుబలి-2 చిత్రాలు హయ్యెస్ట్ షేర్ కలెక్షన్లో టాప్లో ఉన్నాయి. వాటి తర్వాతి స్థానంలో ‘మహర్షి’ చేరడం పక్కాగా కనిపిస్తోంది. ప్రస్తుతం వేరే పెద్ద సినిమాలేమీ లేకపోవడంతో మహర్షికి కలిసొస్తోంది. కలెక్షన్లు స్టడీగా ఉంటే మూడో వారం ముగిసేసరికి రంగస్థలాన్ని దాటేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.