YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఢిల్లీలో బిజీబిజీగా ఏపి సీఎం చంద్రబాబు

ఢిల్లీలో బిజీబిజీగా ఏపి సీఎం చంద్రబాబు

ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, శరద్‌పవార్, శరద్‌ యాదవ్, సురవరం సుధాకర్‌ రెడ్డి, డి.రాజాను వేర్వేరుగా చంద్రబాబు కలిశారు. ఎన్నికల ఫలితాల తర్వాత అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్లు సమాచారం. ఫలితాల ముందే ఎన్డీయేతర పక్షాలను చంద్రబాబు ఏకం చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం చంద్రబాబు ఢిల్లీ నుంచి లక్నో వెళ్లారు. ఎస్పీ, బీఎస్పీ అధినేతలతో భేటీ కాబోతున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత అనుసరించాల్సిన వ్యూహాలపై వీరిద్దరితో చంద్రబాబు చర్చించబోతున్నారు. ఎన్డీయేతర పక్షాలను బలోపేతం చేసేందుకు ఏఏ చర్యలు చేపట్టాలి... ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి ఉంది.. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ఏఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి.. అనే అంశాలపై వీరిద్దరితో చంద్రబాబు చర్చించబోతున్నారు.ఇటీవల రాహుల్‌ను చంద్రబాబు కలిశారు. ఈ భేటీలో రాహుల్‌కు చంద్రబాబు ఓ రిపోర్టు కూడా ఇచ్చినట్లు సమాచారం. ఇప్పుడున్న పరిస్థితిల్లో కాంగ్రెస్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం.. లేదా ఆ పార్టీ మద్దతుతో ప్రాంతీయ పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పడే సూచనలు ఉన్నాయనేది రాజకీయ నిపుణులు అంచానా. ఇదే విషయాన్ని చంద్రబాబు, రాహుల్‌కు ఓ నివేదిక ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా చంద్రబాబు అంచనా ప్రకారం బీజేపీకి వంద సీట్లు కచ్చితంగా తగ్గిపోతాయని ఆయన అంచనా వేస్తున్నారు.మరోవైపు అతి పెద్ద పార్టీగా బీజేపీ అవతరించబోతుందని చంద్రబాబు తన రిపోర్టులో పేర్కొన్నట్లు సమాచారం. అలాగే బీజేపీ కన్నా కాంగ్రెస్‌కు యాభై సీట్లు తక్కువ వస్తాయని చంద్రబాబు జోస్యం చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడిన ప్రాంతీయ పార్టీలకు అత్యధిక సీట్లు వస్తాయని ఆయన చెబుతున్నారు. ఏపీలో గత ఎన్నికల ఫలితాలే రిపీట్ అవుతాయని చంద్రబాబు, రాహుల్‌కు ఇచ్చిన రిపోర్ట్‌లో పేర్కొనట్లు సమాచారం.

Related Posts