కేదారినాథ్ తనకు ఇప్పటికే చాలా ఎక్కువ ఇచ్చారని, అందుకే ఆయనను మరేమీ ఇవ్వాలని కోరలేదని భారత ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. ఉత్తరాఖండ్లో రెండు రోజుల పర్యటనలో ఉన్న మోదీ జ్యోతిర్లంగ క్షేత్రమైన కేదారినాథ్ను దర్శించుకున్న అనంతరం అక్కడి పవిత్ర ధ్యాన గుహలో ధ్యానముద్రలో ఈ రోజు ఉదయం వరకు ఉన్న విషయం తెలిసిందే.