యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఆంధ్రప్రదేశ్ లోని చంద్రగిరిలో ఈరోజు ఏడు గ్రామాల్లో రీపోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. దళితులను ఓటేయనివ్వలేదని వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఫిర్యాదు చేయడంతో ఈసీ ఎన్ఆర్ కమ్మపల్లె, కమ్మపల్లె, పులివర్తిపల్లె, కొత్త కండ్రిగ, వెంకట్రామపురం, కాలూరు, కుప్పం బాదూరులో ఈరోజు రీ-పోలింగ్ నిర్వహిస్తోంది. పులివర్తిపల్లిలో ఈరోజు మధ్యాహ్నం నాటికి 33 శాతం పోలింగ్ నమోదు కాగా, వెంకట్రామపురంలో 52 శాతం, కొత్త కండ్రిగలో 26 శాతం, కమ్మపల్లెలో 23 శాతం, ఎన్ఆర్ కమ్మపల్లెలో 34 శాతం, కుప్పంబాదూరులో 35 శాతం పోలింగ్ నమోదయింది. అలాగే కాలూరులో 36 శాతం పోలింగ్ పూర్తయింది. రీపోలింగ్ మొత్తం సగటు ఓటింగ్ 33 శాతంగా నిలిచింది