ఏపీలో టీడీపీనే విజయకేతనం ఎగరవేయబోతోందని ‘ఆంధ్రా ఆక్టోపస్’ లగడపాటి అభిప్రాయపడ్డారు. తిరుపతిలో ఈరోజు సాయంత్రం తన ఎన్నికల సర్వే వివరాలను ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఏపీలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి 100 (అటూ ఇటూగా 10 స్థానాలు) రావొచ్చని అన్నారు. వైసీపీ అధికారంలోకి రాకపోయినా గట్టి పోటీ ఇచ్చిందని ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి 72 (అటూ ఇటూగా 7 స్థానాలు), ఇతరులు 3 (అటూ ఇటూగా 2 స్థానాలు)) వస్తాయని అభిప్రాయపడ్డారు. లోక్ సభ ఎన్నికల్లోనూ టీడీపీదే పై చేయిగా ఉంటుందని అన్నారు. టీడీపీకి 15 (అటూ ఇటూగా 2 స్థానాలు) వైసీపీకి 10 (అటూ ఇటూగా 2 స్థానాలు) ,ఇతరులు 1 స్థానం సాధించే అవకాశాలున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో ఆయా పార్టీలకు లభించే ఓట్ల శాతం వివరాల అంచనా వివరాలను తెలిపారు.