యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చేశాయి. దాదాపు సర్వేల న్నీ బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని చెబు తున్నాయి. అయితే, గతంలో ఎగ్జిట్ పోల్స్ చెప్పిన దానికీ, వాస్తవ ఫలితాలకు మధ్య చాలా తేడా కనిపించింది. ఈ నేపథ్యంలో 1998-2014 మధ్య జరిగిన ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అన్నదెంటీ? వాస్తవ ఫలితాలు ఎలా వచ్చాయో చూద్దాం.అవుట్ లుక్/ఏసీ నీల్సన్ సర్వే బీజేపీకి 238 సీట్లు, కాంగ్రెస్‌కు 149 సీట్లు వస్తాయని అంచ నా వేసింది. డీఆర్‌ఎస్ సర్వే బీజేపీకి 249 సీట్లు, కాంగ్రెస్‌కు 155 స్థానాలు వస్తాయని చెప్పింది. ఇండియా టుడే/సీఎస్‌డీఎస్ బీజేపీకి 214 సీట్లు, కాంగ్రెస్‌కు 164 సీట్లు వస్తాయని అంచనా వేసింది. కానీ వాస్తవంగా బీజేపీకి 252, కాంగ్రెస్‌కు 166 సీట్లు వచ్చాయి.
1999 ఎన్నికల్లో బీజేపీకి 336, కాంగ్రెస్‌కు 146 స్థానాలు వస్తాయని ఇండియాటుడే/ ఇన్‌సైట్ సర్వే చెప్పగా, అవుట్‌లుక్/సీఎంఎస్ సర్వేలో బీజేపీకి 329, కాంగ్రెస్‌కు 145 స్థానాలు వస్తాయని చెప్పింది. హెచ్‌టీ-ఏసీ నీల్సన్ సర్వేలో బీజేపీకి 300, కాంగ్రెస్‌కు 146 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. కానీ వాస్తవంగా బీజేపీకి 296, కాంగ్రెస్‌కు 134 సీట్లు వచ్చాయి.2004లో బీజేపీకి 290 సీట్లు, కాంగ్రెస్‌కు 169 స్థానాలు వస్తాయని ఔట్‌లుక్-ఎండీఆర్‌ఏ సర్వే పేర్కొనగా, స్టార్-సీఓటర్ బీజేపీకి 275 స్థానాలు, కాంగ్రెస్‌కు 186 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. కానీ వాస్తవ ఫలితాలు మాత్రం మరోలా వచ్చాయి. బీజేపీకి 189, కాంగ్రెస్‌కు 222 స్థానాలు వచ్చాయి. 2009 ఎన్నికల్లో బీజేపీకి 197, కాంగ్రెస్‌కు 199 స్థానాలు వస్తాయని స్టార్ న్యూస్/ఏసీ నీల్సన్ చెప్పగా, టైమ్స్ నౌ బీజపీకి 183, కాంగ్రెస్‌కు 198 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. హెడ్‌లైన్స్ టుడే బీజేపీకి 180 సీట్లు, కాంగ్రెస్‌కు 191 సీట్లు వస్తాయని చెప్పింది. కానీ వాస్తవంగా బీజేపీకి 159 సీట్లు, కాంగ్రెస్‌కు 262 స్థానాలు వచ్చాయి. 2014లో బీజేపీకి 281 సీట్లు, కాంగ్రెస్ 97 సీట్లు వస్తాయని ఏబీపీ నీల్సన్ సర్వే చెప్పగా, టైమ్స్ నౌ-ఓఆర్‌జీ సర్వే బీజేపీకి 249, కాంగ్రెస్‌కు 148 సీట్లు సొంతం చేసుకుంటుందని చెప్పింది. ఇండియా టీవీ-సీ ఓటర్ సర్వే బీజేపీకి 289 సీట్లు, కాంగ్రెస్‌కు 101 సీట్లు వస్తాయని తేల్చింది. ఎన్‌డీటీవీ బీజేపీకి 279 సీట్లు, కాంగ్రెస్‌కు 103 సీట్లు వస్తాయని అంచనా వేసింది. కానీ అధికారిక ఫలితాల్లో మాత్రం బీజేపీకి 336, కాంగ్రెస్‌కు 59 సీట్లు వచ్చాయి.