యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
2016 మే లొ జరిగిన తమిళనాడు ఎన్నికలలొ లగడపాటి రాజగొపాల్ సర్వే పెరుతొ జయలలిత పార్టి AIADMK ఒడిపొతుంది అని కరుణానిధి పార్టి DMK బంపర్ మెజారిటి తొ గెలవబొతుంది అని చెప్పారు , ఫలితాలు వచ్చెసరికి AIADMK జయలలిత పార్టికి 134 సీట్లు రాగ , DMK కరుణ నిధి పార్టికి 89 స్థానాలు మాత్రమే వచ్చాయి , ఈ ఫలితాలు లగడపాటి సర్వే ని పూర్తిగా తారుమారు చేశాయి.
ఇక 2018 మే లొ జరిగిన కర్నాటక ఎన్నికలలొ మెజారిటి సర్వేలు హంగ్ ఏర్పడుతుంది అని చెప్పగా ,లగడపాటి సర్వే మాత్రం బి.జే.పి కి తిరుగులేని మేజారిటి వస్తుంది, ఎవరి మద్దతు లేకుండానే ప్రభుత్వం ని ఏర్పర్చుతుంది అని చెప్పింది లగడపాటి సర్వే - ఫలితాలు వచ్చెసరికి లగడపాటీ సర్వే తారుమారు అయ్యి , మెజారిటి సర్వేలు చెప్పినట్టుగా ఎవరికి ప్రభుత్వం ని ఏర్పాటూ చెసే నెంబర్ రాక చివరికి కాంగ్రెస్ మద్దతు తొ JD(S) కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యారు ఇక్కడ కూడా లగడపాటి సర్వే తారుమారైంది.
అలాగే 2018 డిసెంబర్ లో జరిగిన తెలంగాణ ఎన్నికల ఫలితాలు మనం చూసాం
ఆంద్ర ఆక్టొపస్ సర్వే పెరుతొ చెప్పె ఫలితాలు ఏమి బ్రహ్మ్మ వాక్కులు కాదు, ఆయన చెసిన సర్వేలలొ తారుమారయిన సందర్భాలు అనేకం ఉన్నాయి , ఆయన చెపితే జరిగినట్టే అనే ఆపొహలొ ఉండి బెట్టింగులకి దిగి ఒళ్ళు , ఇళ్ళు గుళ్ళ చెసుకుని రొడ్డున పడ్డద్దు - తస్మాత్ జాగ్రత్త , బెట్టింగ్ అనే వ్యసనం కి దూరంగా ఉండండి ...