యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
పులివెందుల. పెద్దగా పరిచయం అక్కర్లేని కీలకమైన నియోజకవర్గం. తాజా ఎన్నికల్లో ఈ నియోజకవర్గం రికార్డులు సృష్టి స్తుందని అంచనా వేస్తున్నారు మేధావులు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నికలు ఒక ఎత్తు అయితే.. ఇక్కడ ఒక్క నియోజకవ ర్గంలో జరిగిన ఎన్నికలు మరో ఎత్తు! ఈ నియోజకవర్గం వైఎస్ ఫ్యామిలీకి కంచుకోట. ఇక్కడ నుంచి వైఎస్ కుటుంబానికి చెందిన వారే ఇప్పటి వరకు గెలుస్తూ.. వచ్చారు. వైఎస్ మరణానంతరం జరిగిన ఎన్నికల్లో ఆయన సతీమణి విజయమ్మ.. దాదాపు 83 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొంది రికార్డు సృష్టించారు.ఇక, 2014లో ఇక్కడ నుంచి పోటీ చేసిన వైసీపీ అధినేత జగన్ అతి పెద్ద రికార్డును సృష్టించారు. దాదాపు 97 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో జగన్ విజయం సాధించారు. ఇదే ఒక్క కడప జిల్లాలోనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద రికార్డు. అలాంటి నియోజకవర్గంలో జగన్‌ను ఓడించాలని టీడీపీ అధినేత చంద్రబాబు కంకణం కట్టుకు న్నారు. ఈ క్రమంలోనే బాబు వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేశారు. అదేసమయంలో ప్రతి ఒక్కరితోనూ బాబు చర్చించి ఇక్కడ విజయావకాశాలపై దృష్టి పెట్టారు.నిజానికి గత ఎన్నికల వరకు కూడా ప్రత్యర్థి పార్టీ వీక్‌నెస్‌పై టీడీపీ ఆధారపడేది. అయితే, ఈ సారి మాత్రం చంద్రబాబు ప్రయోగాలు చేశారు. ప్రత్యర్థి పార్టీ బలహీ నతలతోపాటు.. టీడీపీ బలాన్ని కూడా ఇక్కడ పెంచారు.పులివెందుల నియోజకవర్గంలో రైతుల సమస్యలను పరిష్కరించేందుకు నడుం బిగించారు. ఈ క్రమంలోనే టీడీపీ నాయకుడు సతీష్ రెడ్డి పులివెందులకు పట్టిసీమ ద్వారా కృష్ణానీటిని ఇచ్చే వరకు కూడా తాను గడ్డం తీయనని శపథం చేసి మరీ సాధించారు. అదేసమయంలో అన్ని వర్గాలకూ చేరువయ్యారు. ఇవన్నీ కూడా తమకు కలసి వస్తాయని టీడీపీ భావిస్తోంది. ఇక, ఎన్నికల ప్రచారాన్ని కూడా టీడీపీ హోరెత్తించింది. ఈ నేపథ్యంలో వైఎస్ కుటుంబానికి సంప్రదాయంగా ఉన్న ఓటు బ్యాంకు తమకు పడుతుందని నాయకులు భావిస్తున్నారు. అయితే, ఇది అంత తేలికగా జరిగేది కాదని అనేవారూ ఉన్నారు.జగన్ సీఎం అయితే, తనసొంత జిల్లా, సొంత నియోజకవర్గం కోసం ఎంతైనా చేస్తారని ఇక్కడ పెద్ద ఎత్తున ప్రచారం జరగుతోంది. పైగా.. వైసీపీ అధికారంలోకి వస్తుందనే మౌత్ పబ్లిసిటీ ఎక్కువగా ఉండడంతో ప్రజలు ఎక్కడాబెణక లేదని కూడా అంటున్నారు. ఇక, జగన్ ఫ్యామిలీ నుంచి ఆయన సతీమణి భారతి తొలిసారి ఇక్కడ ప్రచారం చేసి ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్థించారు. ఇదిలావుంటే, ఈ నియోజకవర్గంలో సింహాద్రిపురం, లింగాల, తొండూరు, పులివెందుల, వేముల, వేంపల్లె, చక్రాయపేట మండలాలు ఉన్నాయి. వీటిలో వైసీపీకి మెజారిటీ మండలాలు అండగా నిలుస్తున్నాయి. అయితే, సింహాద్రిపురం, లింగాల, తొండూరుల్లో వైసీపీని నిలువరించామని, మెజారిటీ తమకే దక్కుతుందని టీడీపీ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు టీడీపీ తన పంతం నెగ్గించుకుంటుందా? లేక జగన్ తన హవాను నిలుపుకుంటాడా? అనేది వేచి చూడా