YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

తెలంగాణ సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్‌

Highlights

  • తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్‌
  • 12 మంది మావోయిస్టులు హతం 
  • పా ర్టీ కీలక నేత హరిభూషణ్‌ కూడా..?
తెలంగాణ సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్‌

 శుక్రవారం తెల్లవారుజామున భారీ ఎన్‌కౌంటర్ లో మావోయిస్ట్ అగ్రనేత  హరిభూషన్ హతమయ్యారు. భద్రాద్రి జిల్లా చర్ల మండలం తొండపాల్ వద్ద పోలీసులకు మావోలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 20 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు.మృతులలో మావోయిస్ట్ అగ్రనేత  హరిభూషన్ ఉన్నట్టు దృవీకరించిన పోలీసు వర్గాలు గుర్తించాయి. ఘటనా స్థలంలో 2 ఏకే 47  సహా10 మృతదేహాలు స్వాధీనం.. మృతులలో ఒక పోలీస్ కమాండో సునీల్ కూడా ఉన్నారు. చర్ల మండలం తొండపాల్‌  సమీపంలో మావోయిస్టులు సమావేశం జరుపుతున్నారన్న సమాచారంతో గ్రేహౌండ్స్‌-ఈవోఎస్‌ బలగాలు అటుగా కదిలాయి. బలగాల రాకను గుర్తించిన మావోయిస్టులు.. ఒక్కసారిగా కాల్పులు మొదలుపెట్టారు. దీనితో  పోలీసు బలగాలు కూడా ఎదురుకాల్పులు చేశాయి అందుకున్న గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో మావోయిస్టులు ఎదురుపడటంతో ఇరువురి మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో  మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. 
ఇదిలా ఉండగా మృతి చెందిన కానిస్టేబుల్  సైబరాబాద్ సివిల్ 2004 బ్యాచ్ కాగా 2010 లో డిప్యూటషన్ లో భాగంగా గ్రేహౌండ్స్ కు వెళ్లినాడు. ఇతని స్వస్థలం వికారాబాద్ జిల్లా, మొమిన్ పెట్ మండలం,  మేకవనంపల్లి గ్రామమని తోటి పోలీస్ సిబ్బంది పేర్కొంటున్నారు.

Related Posts