యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలో ఉన్నదనిఆ రాష్ట్ర బీజేపీ శాఖ గవర్నర్ ఆనందీబెన్ పటేల్‌కు లేఖ రాసింది. సీఎం కమల్‌నాథ్ ప్రభుత్వం మైనార్టీలో ఉన్నదని, తక్షణమే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేయాలని బీజేపీ గవర్నర్‌ను కోరింది. అసెంబ్లీని సమావేశపరిస్తే.. కమల్‌నాథ్ ప్రభుత్వం కూలిపోతుందని బీజేపీ తన లేఖలో పేర్కొన్నది. మధ్యప్రదేశ్‌లోని బీజేపీ నేత గోపాల్ భార్గవా ఈ కామెంట్స్ చేశారు. లోక్‌సభ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ వెలువడిన మరుసటి రోజే బీజేపీ తన డిమాండ్‌ను వ్యక్తం చేయడం విశేషం. ఆ రాష్ట్రంలో బీజేపీ సుమారు 24 సీట్లను కైవసం చేసుకుంటుందని కూడా ఎగ్జిట్ సర్వేలు చెబుతున్నాయి. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుభి మోగించింది. కానీ స్వల్ప మెజారిటీతోనే సీఎం కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్‌కు అక్కడ మాయావతి, అఖిలేశ్ మద్దతు ఉన్నది.