YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

ఒక్క రోజే 4 లక్షల కోట్ల ఆదాయం

ఒక్క రోజే 4 లక్షల కోట్ల ఆదాయం

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

ఎగ్జిట్ పోల్ పుణ్యమా అని స్టాక్ మార్కెట్ దుమ్ముదుమారంగా వెళుతుంది. కొన్నాళ్లుగా ఒడిదిడుగులతో ఉన్న షేర్లు ఇప్పుడు పరిగెడుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ లో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం క్లియర్ మెజార్టీతో వస్తుందని.. హంగ్ రాదని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఈ ప్రభావం స్టాక్ మార్కెట్ పై పడింది. సెన్సెక్స్ 1,200 పాయింట్ల లాభంతో 39వేల మార్క్ దాటింది. నిఫ్టీ 360 పాయింట్ల లాభంతో.. 11,700 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఎక్కువ షేర్లు గ్రీన్ లో ఉన్నాయి. మే 20వ తేదీ ఒక్క రోజే అక్షరాల 4 లక్షల కోట్లు సంపాదించారు ఇన్వెస్టర్లు. సోమవారం ఒక్క రోజే జరిగిన ఈ సంపద సృష్టించారు ఇన్వెస్టర్లు. లాభాలతో ప్రారంభం అయిన మార్కెట్లు.. అదే ఒరవడిని కంటిన్యూ చేశాయి. బ్యాంకింగ్, ఆటో షేర్లు 4శాతం లాభం ఆర్జించాయి. ఎస్బీఐ  8 శాతం, ఎస్ బ్యాంక్ 6 శాతం, ఎల్ అండ్ టీ,ఐసీఐసీఐ   , ఇండంస్ ఇండ్ బ్యాంకులు 4-5 శాతం లాభాల్లో ఉన్నాయి. టాటా మోటార్స్, మారుతీ, టాటా స్టీల్, ఓఎన్జీసీ, ఆర్ఐఎల్  షేర్లు కూడా 5 శాతం వరకు లాభపడ్డాయి. ఐటీ కంపెనీ షేర్లలో ఒడిదుడుకులు కనిపించాయి.రూపాయి విలువ కూడా పెరిగింది. డాలర్ తో పోల్చితే 69.36 దగ్గర ట్రేడ్ అవుతుంది.ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ మార్కెట్ వర్గాలకు బూస్ట్ ఇచ్చాయి. వచ్చేది స్థిరమైన ప్రభుత్వం.. అందులోనూ ఉన్న ప్రభుత్వమే కొనసాగుతుందన్న అంచనాల క్రమంలో పెట్టుబడిదారులు భారీ సంఖ్యలో షేర్లలో కొనుగోళ్లకు ఎగబడ్డారు. బ్యాంకింగ్, ఆటో, ఆయిల్, రిలయన్స్, ఆదానీ గ్రూప్ షేర్లు అయితే భారీగా లాభపడ్డాయి. మొత్తంగా 4 లక్షల కోట్ల రూపాయలను పెరిగిన షేర్ల ధరలతో సంపాదించారు ఇన్వెస్టర్లు.

Related Posts