YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

లార్డ్స్‌లో వరల్డ్‌కప్‌ ముద్దాడేది ఎవరు....

 లార్డ్స్‌లో వరల్డ్‌కప్‌ ముద్దాడేది ఎవరు....

యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:

ప్రపంచ క్రికిట్‌ ఉత్సవం మన ముందుకొస్తుంది. ప్రపంచ కప్‌ రానే వచ్చింది. గత 25 ఏండ్లలో ప్రపంచకప్‌ను శాసించిన ఆస్ట్రేలియా 2019 వరల్డ్‌కప్‌లో హాట్‌ ఫేవరెట్‌ కాదు. స్వదేశంలో జరిగిన 2015 వరల్డ్‌కప్‌లో చిరకాల ప్రత్యర్థి, మరో ఆతిథ్య జట్టు న్యూజిలాండ్‌పై విజయంతో కంగారూలు కప్పు కొట్టేశారువరల్డ్‌ కప్‌ అందుకునేందుకు  నాలుగేండ్లుగా ప్రణాళికలు రచిస్తూ, వ్యూహలకు పదును పెడుతున్నాయి. 2015 ప్రపంచకప్‌ తర్వాత ఎన్నో మార్పులొచ్చాయి. డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియా ఈ సారి ప్రపంచ కప్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగటం లేదు. . ప్రపంచకప్‌ ఎక్కడ జరిగినా హాట్‌ ఫేవరెట్‌ సీటులో కూర్చునే కంగారూ ఈసారి వెనుక సీటులోకి వెళ్లిపోయింది. మూడు మాసాల ముందర, ప్రపంచకప్‌ అనగానే ఆతిథ్య ఇంగ్లాండ్‌, హాట్‌ ఫేవరెట్‌ భారత్‌ పేర్లే వినిపించాయి. కానీ కొద్ది కాలంలోనే సమీకరణాలు మారిపోయాయి. ఇంగ్లాండ్‌, భారత్‌ ఫైనల్‌ అంటూ విశ్లేషకులు జోస్యం చెబుతున్నా.. మేమూ రేసులో ఉన్నామని మిగతా జట్లు దూసుకొచ్చాయి.
 అరివీర ఇంగ్లాండ్‌ :
 ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నిలకడగా అగ్రస్థానం. ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ (2017) సెమీఫైనల్స్‌ తర్వాత అన్ని ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ల్లో ఎదురులేని విజయాలు. 400 లక్ష్యమైనా అలవోకగా ఛేదించగల భయానక బ్యాటింగ్‌ లైనప్‌. సొంతగడ్డపై జరుగుతున్న నాల్గో వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్‌ను హాట్‌ ఫేవరెట్‌గా నిల్పుతున్నాయి. ఎంతటి బౌలింగ్‌ బృందాన్నైనా చీల్చి చెండాడగల విధ్వంసక బ్యాటింగ్‌ లైనప్‌ ఇంగ్లాండ్‌ సొంతం. జోశ్‌ బట్లర్‌, జేసన్‌ రారు, క్రిస్‌ వోక్స్‌, ఇయాన్‌ మోర్గాన్‌లు భీకర ఫామ్‌లో ఉన్నారు. అద్భుత ఫామ్‌కు తోడు సొంత గడ్డ అనుకూలత ఇంగ్లాండ్‌ను హాట్‌ ఫేవరెట్‌ను చేశాయి. ప్రపంచకప్‌ చరిత్రలో ఇది వరకు ఎన్నడూ ఇంగ్లాండ్‌ ప్రపంచకప్‌కు ఈ స్థాయి ఫేవరెట్‌ కాదు. ప్రపంచకప్‌ను నెగ్గేందుకు బహుశా, ఇంగ్లాండ్‌కు ఇంత కంటే మంచి అవకాశం రాదు!. ప్రపంచకప్‌ వేట ప్రతికూలంగా ముగిస్తే, ఆ అపవాదు ఇంగ్లాండ్‌ బౌలర్లదే అవుతుంది!.
రేసులోనే భారత్‌ :
ఐసీస్‌ వన్డే ర్యాంకింగ్స్‌లో జట్టు రెండో స్థానంలో నిలిచినా.. బ్యాటింగ్‌, బౌలింగ్‌ జాబితాల్లో విరాట్‌ కోహ్లి, జశ్‌ప్రీత్‌ బుమ్రా అగ్రస్థానాల్లో ఉన్నారు. వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వరల్డ్‌ సెకండ్‌ బెస్ట్‌ బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతున్నాడు. అత్యంత నిలకడ, విధ్వంసక టాప్‌-3 బ్యాట్స్‌మన్‌ శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి సహా బుమ్రా, భువి, షమిలతో కూడిన పదునైన పేస్‌ విభాగం భారత్‌ను వరల్డ్‌కప్‌ ఫేవరేట్‌ను చేశాయి. ఇంగ్లాండ్‌లోనే జరిగిన చివరి రెండు ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీల్లో భారత్‌ ఫైనల్స్‌కు చేరింది. ఇంగ్లాండ్‌ పరిస్థితుల్లో మెరుగ్గా రాణించగల ఆత్మవిశ్వాసం కోహ్లిసేన సొంతం. ఎం.ఎస్‌ ధోని క్రికెట్‌ నైపుణ్యం, అపార అనుభవం, వెల కట్టలేని వ్యూహ చతురత అదనపు బలం. టాప్‌ ఆర్డర్‌, బౌలింగ్‌ పదును బాగానే ఉన్నా.. మిడిల్‌ ఆర్డర్‌ సమస్య వేధిస్తోంది. ఈసారి ప్రపంచ కప్‌ దూరమైతే, అది కచ్చితంగా మిడిల్‌ ఆర్డర్‌ వైఫల్యం అనే చెప్పవచ్చు.
పద పద పాకిస్థాన్‌ :
 అంచనాలకు అందని, ఏ రోజు ఎలా ఆడుతుందో ఊహించలేని ఏకైక జట్టు పాకిస్థాన్‌. వన్డే ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానంలో నిలిచినా, వరల్డ్‌కప్‌ ఫేవరెట్ల జాబితాలో ఉండానికి కారణం ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ అందుకోవటం. లీగ్‌ దశలో భారత్‌ చేతిలో చిత్తుగా ఓడినా, ఫైనల్లో ఊహించని విజయం సాధించిన ఘనత పాక్‌ది. పాకిస్థాన్‌ పరిస్థితుల్లో మరుగైన ప్రదర్శన చేయగల సత్తా అదనపు అనుకూలత. టాప్‌ ఆర్డర్‌లో బాబర్‌ ఆజామ్‌ గొప్ప ఫామ్‌లో ఉన్నాడు. బౌలర్లలో హసన్‌ అలీ ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టగల సమర్థుడు. అన్నింటికి మించి, అంచనాలకు అందని ట్యాగ్‌ పాకిస్థాన్‌పై ఒత్తిడి తగ్గిస్తోంది. తాజాగా, ఆస్ట్రేలియా చేతిలో ఓటమి ఎదురైనా.. ప్రపంచ కప్‌ రేసులో పాకిస్థాన్‌ ముందు వరుసలోనే నిల్చోంది. లీగ్‌ దశ ముగిసిన తర్వాత టాప్‌-4 జాబితాలో పాకిస్థాన్‌ నిలిచే అవకాశం మెండు.
కంగారు లేని కంగారూ :
 ప్రపంచకప్‌ ఫేవరెట్ల జాబితాలో ఆస్ట్రేలియా ఉందా? లేదా ? అని రెండు నెలల ముందు అడిగితే సమాధానం కచ్చితంగా ' లేదు' అనే వచ్చేది. కానీ భారత్‌పై వన్డే సిరీస్‌ విజయం, పాకిస్థాన్‌పై క్లీన్‌స్వీప్‌ విజయం ఆస్ట్రేలియాలో ఆత్మవిశ్వాసం నింపాయి. ఏడాదిగా వేధిస్తోన్న వరుస ఓటములకు ఉన్నట్టుండి, ఒకే నెలలో పరిష్కారం దొరికింది. సమస్యలన్నీ ఒక్కసారిగా, బలంగా మారిపోయాయి. ఫామ్‌ కోల్పోయిన ఆటగాళ్లు, జోరందుకున్నారు. అన్నింటికి మించి, నిషేధం వేటు ముగించుకుని డెవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌ స్మిత్‌ ప్రపంచకప్‌ జట్టుతో చేరిపోయారు. మాజీ నాయకుల చేరికతో ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ బలం అమాంతం పెరిగిపోయింది. టాప్‌ ఆర్డర్‌, మిడిల్‌ ఆర్డర్‌, లోయర్‌ ఆర్డర్‌ అంటూ తేడా లేకుండా కంగారూ శిబిరం బలోపేతమైంది. బౌలింగ్‌ విభాగంలోనూ మిచెల్‌ స్టార్క్‌, పాట్‌ కమిన్స్‌ వంటి వరల్డ్‌ క్లాస్‌ సీమర్‌ సేవలతో ప్రమాదకరంగా కనిపిస్తోంది. పగుళ్ల పిచ్‌పై నాథన్‌ లైయాన్‌, ఆడమ్‌ జంపా ప్రభావం చూపగలరు. ప్రపంచకప్‌ నెగ్గే ఫేవరెట్‌ కాకపోయినా, కనీసం సెమీఫైనల్స్‌కు చేరగల సత్తా ఉన్న జట్టు ఆస్ట్రేలియా.

Related Posts