YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జగన్ దగ్గర సింహపురి పంచాయితీ

 జగన్ దగ్గర సింహపురి పంచాయితీ

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

ప్రభాకర్ రెడ్డి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు. ఆయనకు నెల్లూరు జిల్లా బాధ్యతలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ అప్పగించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల వైసీపీ అభ్యర్థులను సమన్వయ పర్చుకోవడం, ప్రచారం దగ్గర నుంచి పోలింగ్ వరకూ తనతో పాటు తన సిబ్బంది చేత సహాయసహకారాలు అందించారు వేమిరెడ్డి. దీంతో పాటు ఆర్థికంగా వైసీపీ అభ్యర్థులు ఈ ఐదేళ్ల పాటు ఇబ్బంది పడటంతో వారికి ఆ సాయం కూడా చేశారట. అయితేకొందరు అభ్యర్థులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జగన్ కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.ఇందులో ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఒకరు. ఆయన పట్ల వేమిరెడ్డి పోలింగ్ దగ్గర నుంచి గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ముందు వరకూ బాగా పనిచేసిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పోలింగ్ కు నాలుగు రోజుల ముందు చేతులెత్తేశారని వేమిరెడ్డికి తెలియడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. కనీసం పార్టీ కార్యాలయాలను కూడా అనేక చోట్ల కోటంరెడ్డి ఏర్పాటు చేయలేదని, ముఖ్య కార్యకర్తలను, నేతలను ఎన్నికలకు నాలుగు రోజుల ముందు నుంచి పట్టించుకోవడం మానేశారని చెబుతున్నారు.తాను ఆర్థికంగా ఇంత సాయం చేసినా పోలింగ్ కు నాలుగు రోజుల ముందు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహరించిన తీరును వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా తప్పుపడుతున్నారు. నిజానికి కోటంరెడ్డికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గట్టి పట్టుంది. ఆయన నిత్యం ప్రజల్లోనే ఉంటారు. వివిధ సమస్యలపై పోరాడుతుంటారు. అధికారులను బతిమాలో, బెదిరించో సమస్యలను పరిష్కరిస్తుంటారు. ఎన్నికలకు సంవత్సరం ముందే నియోజకవర్గమంతా పాదయాత్రకూడా చేసి వచ్చారు. అయితే ఈ నియోజకవర్గంలో టీడీపీ ఎప్పుడూ పోటీ చేయలేదు.2009లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో పొత్తులో భాగంగా సీపీఎంకు, 2014లో బీజేపీకీ ఈ సీటును తెలుగుదేశం పార్టీ కేటాయించింది. దీంతో నియోజకవర్గం ఆవిర్భవించిన తర్వాత టీడీపీ అసలు పోటీ చేయలేదు. అయితే ఇక్కడ తొలుత ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఇక్కడ చంద్రబాబు సీటు కన్ఫర్మ్ చేశారు. అయితే ఆదాల చివరి నిమిషంలో వైసీపీలో చేరడంతో కార్పొరేషన్ మేయర్ అబ్దుల్ అజీజ్ ను బరిలోకి దించింది. ఇక్కడ ముస్లిం ఓటర్లు కూడా ఎక్కువగా ఉండటంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ నియోజకవర్గంపై ముందు నుంచి ప్రత్యేక దృష్టిపెట్టారు. అజీజ్ గట్టి పోటీ ఇచ్చారని తెలియడంతో కోటంరెడ్డి ఆత్మవిశ్వాసానికి వెళ్లారని, తాను చెప్పినా వినిపించుకోలేదని వేమిరెడ్డి సీరియస్ అయినట్లు తెలుస్తోంది. మొత్తం మీద సింహపురి పంచాయతీ ప్రస్తుతం జగన్ వద్ద ఉంది.

Related Posts