YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అనంతలో గెలుపు ఓటములపై బెట్టింగ్ లు

 అనంతలో గెలుపు ఓటములపై బెట్టింగ్ లు

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

సార్వత్రిక ఎన్నికలు ఇప్పటికే ఏడు దశల ఓటింగ్ ముగిసింది..దాదాపు పూర్తి అయినట్లే దేశం అంతటా మే 23తేదీ కోసం వేసి చూస్తున్నారు...ఇక ఆంధ్రప్రదేశ్లో ఒకటే ఉత్కంఠత ఏపార్టీ అధికారంలోకి వస్తుంది, ఏ అభ్యర్థి గెలుస్తారు అని నేతలు దగ్గర నుంచి సామాన్య ప్రజలు బెట్టింగ్ రాయళ్లు వరకు జిల్లాలో ఒక్కటే టెంక్షన్..అంతర్మథనంలో వైసీపీ శ్రేణులు ఆఎమ్మెల్యే అభ్యర్థిపై బెట్టింగులకు నిరాకరిస్తున్నారని నియోజకవర్గంలో ఆ పార్టీ శ్రేణులు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరో పది రోజులలో వీటి అన్నిటికి తెరపడనుంది.నియోజకవర్గంలోని వైసీపీ శ్రేణుల్లో అంతర్మథనం మొదలైంది. సార్వత్రిక ఎన్నికల అనంతరం కల్యాణదుర్గం వైసీపీ అభ్యర్థి ఉషా వైఖరిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో ఆమె ఓటమిపాలైతే ఇందుకు నైతిక బాధ్యత ఆమెదేనని ఆ పార్టీ కార్యకర్తలు బాహాటంగా చెబుతున్నారు. ఆమె వ్యవహారశైలి పట్ల నాయకులు, కార్యకర్తలు విస్మయం చెందారనే విమర్శలు లేకపోలేదు. ఏప్రిల్‌ 11న సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తరువాత నియోజకవర్గంలో గెలుపోటములపై బెట్టింగ్‌లు వేసేందుకు ఆపార్టీ శ్రేణులు తహతహలాడారు. పోలింగ్‌ కేంద్రాల వారిగా ఓటింగ్‌ సరళిని పరిశీలించిన అధినాయకులు అంతర్మథనంలో పడినట్లు కార్యకర్తల్లో చర్చ సాగుతోంది. నాటి నుంచి నేటి దాకా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా పేరొందిన కళ్యాణదుర్గంలో వైసీపీ పాగా వేయడం అంత సులభతరం కాదని ఆ పార్టీ నాయకులు కుండ బద్దలుకొట్టినట్లు తెలుస్తోంది-టీడీపీ ఆవిర్భావం అనంతరం ఎనిమిది పర్యాయాలు జరిగిన ఎన్నికల్లో 1989లో దివంగత లక్ష్మీదేవమ్మ, 2009లో ప్రస్తుత కాంగ్రెస్‌ అభ్యర్థి రఘువీరారెడ్డి మాత్రమే గెలుపొందారు. మిగిలిన ఆరు పర్యాయాలు టీడీపీనే జెండా ఎగురవేసింది. ఉషా స్థానికేతరురాలు కాకపోవడం అన్నివర్గాల నాయకులను ఏకం చేయడంలో విఫలం కావడంతోనే ఆమె పనితీరు పట్ల పార్టీ కార్యకర్తల్లో వ్యతిరేకత పెరిగినట్లు తెలుస్తోంది. మొదట్లో గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన నాయకులు బెట్టింగ్‌లు వేసేందుకు తహతహలాడారు. గెలుపు ఓటములపై పోలింగ్‌ కేంద్రాలవారిగా అంచనాలు వేసుకున్న తరువాత పందేలు కాసేందుకు నిరాకరిస్తున్నట్లు ఆపార్టీ శ్రేణుల్లో విస్తృత చర్చ సాగుతోంది. పార్టీ గెలుపుపై ప్రగాఢ నమ్మకం ఉన్న నాయకులు లక్షలాది రూపాయలు ముందస్తుగా పందేలుకాసారు. ఓటింగ్‌ సరళి, నివేదికలు తారుమారు కావడంతో పదిశాతం పట్టుకుని తక్కిన మొత్తం ఇవ్వాలని మధ్యవర్తుల వద్ద బేరసారాలు సాగిస్తున్నట్లు సమాచారం. ఉషా ఎన్నికల మరుసటి రోజు కార్యకర్తలతో సమీక్ష నిర్వహించి వెళ్లిపోయారు. ఆమెకు నమ్మినబంట్లుగా ఉన్న కొందరు నాయకులు, ఇతర ప్రాంతాలకు చెందిన విద్యావంతులతో రహస్యంగా పోలింగ్‌ కేంద్రాలవారిగా సర్వే నిర్వహించి నివేదిక తయారు చేయించినట్లు సమాచారం. వారు నిర్వహించిన సర్వేలో ఆదినుంచి ఆమె ప్రదర్శించిన వ్యవహార శైలి, నా యకుల పట్ల ఆమెకున్న అపనమ్మకం, పోలింగ్‌ ముందుకు ఓటర్లకు డబ్బు పంపిణీలో స్థానిక నాయకులను నమ్మకపోవడం, తదితర విషయాలు వెలుగులోకి వచ్చినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ముందు నుంచి ప్రధాన కార్యకర్తలను పార్టీ కార్యక్రమాలు వారికి ఉంచడంతో వారి మధ్య విభేదాలు తారాస్థాయిలో ఉన్నట్లు కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. కనీసం ఎన్నికల సమయంలో కూడా పార్టీకి దూరంగా ఉన్న నాయకులను ఏకం చేయడంలో ఆమె విఫలమైనట్లు విమర్శలు గుప్పుమంటున్నాయి. ఇప్పటికే గెలుపు ఓటములపై ఓ నిర్ణయానికి వచ్చిన ఉషా ఎన్నికల్లో సహకరించని నాయకుల జాబితాను తయారుచేసి పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఫిర్యాదు చేసినట్లు ఆపార్టీ నాయకుల్లో బాహాటంగా చర్చ సాగుతోంది. ఉషా ముందు నుంచి వాల్మీకులను విస్మరిస్తూ వస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆ సామాజిక వర్గం నాయకులు కూడా ఎన్నికల్లో ఆమెకు సహాయ నిరాకరణ చేసినట్లు సమాచారం. అయితే ఆ పార్టీలో నెలకొన్న విభేదాలు, వర్గపోరు, ఓటింగ్‌ సరళిలో మార్పులపై చర్చ సాగుతోంది.అయితే కళ్యాణదుర్గంలో ఉషాశ్రీ చరణ్ గెలుస్తారా లేక ఒడిపోతారా అనేది మే 23వ తేదీ వరకు ఆగాల్సిందే..

Related Posts