YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సింగిల్ చాన్స్ ఎమ్మెల్యేగా రావెల

సింగిల్ చాన్స్ ఎమ్మెల్యేగా రావెల

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

రావెల కిశోర్ బాబు… ఐఆర్ఎస్ అధికారిగా ఉండి.. రాజకీయాల్లోకి వచ్చి తొలిసారి విజయం సాధించిన రావెల కిశోర్ బాబు అనూహ్యంగా మొదటి సారి గెలిచి మంత్రి పదవినీ చేపట్టారు. ఆయనకు అనుకోకుండా అన్నీ వరాలుగా వచ్చిపడ్డాయి. ఆయనను చూసి అసూయ పడిన వాళ్లు అప్పట్లో అనేక మంది ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతలు సయితం మంత్రి పదవి ఎంత సులువుగా కొట్టేశారంటూ ముక్కున వేలేసుకున్నారు. అలాంటి రావెల కిశోర్ బాబు రాజకీయ చరిత్ర ఒక్కసారితోనే ముగిసిపోతుందా? ఆయన ఒక్క సారి ఎమ్మెల్యేగానే మిగిలిపోతారా? అన్నది చర్చనీయాంశమయింది.రావెల కిశోర్ బాబు దాదాపు రెండున్నరేళ్ల పాటు ఏపీ రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగారు. ఉన్నతాధికారిగా పనిచేస్తూ రాజకీయాల్లోకి వచ్చిన రావెల కిశోర్ బాబుకు మొదటిసారి తెలుగుదేశం పార్టీ టిక్కెట్ లభించింది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసితొలిసారి గెలిచిన రావెల కిశోర్ బాబుకు ఎవరి అంచనాలకు అందని విధంగా చంద్రబాబు కేబినెట్ లో చోటు దక్కింది. అయితే ఆయన ఫక్తురాజకీయనేత కాకపోవడం, ఉన్నతాధికారి వ్యవహార శైలి వీడక పోవడంతో తలనొప్పులుతయారయ్యాయి.రావెల తన సొంత నియోజకవర్గంలోని బలమైన సామాజికవర్గం నేతలతోనే విభేదాలు కొని తెచ్చి పెట్టుకున్నారు. ప్రత్తిపాడు రిజర్వ్ డ్ నియోజకవర్గం కావడంతో అక్కడ ఆ సామాజిక వర్గానిదే ఆధిపత్యం. కానీ రావెల ఉన్నత చదువులు చదివి ఉండటం, ఉన్నతాధికారిగా పనిచేయడంతో వారి ఆధిపత్యానికి తెరదించారు. వారి మాటలను లెక్కచేయలేదు. దీంతో రావెల పై అధిష్టానానికి పుంఖానుపుంఖాలుగా ఫిర్యాదులందాయి.మరోవైపు మందకృష్ణ మాదిగ తో స్నేహమూ రావెల కొంపముంచింది. మొత్తం మీద మంత్రి పదవి ఊడిపోవడంతో ఆయన పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరిపోయారు. జనసేన అభ్యర్థిగా ప్రత్తిపాడు నుంచి మరోసారి బరిలోకి దిగిన రావెల కిశోర్ బాబు గెలిచే ఛాన్సులు అస్సలు లేవంటున్నారు. అక్కడ టీడీపీ అభ్యర్థి డొక్కా మాణిక్య వరప్రసాద్, వైసీపీ అభ్యర్థి మేకతోటి సుచరిత బలంగా ఉన్నారు.రావెలకు కాపు సామాజిక వర్గం, దళిత ఓట్లపై ఆశలు పెట్టుకున్నా అది వర్కవుట్ కాలేదని తెలుస్తోంది. దీంతో రావెల గెలవడం అనేది కష్టమేనని తెలిసిపోయింది. ఆయన తొలుత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళదామని బాగా ప్రయత్నించినా, అక్కడ నుంచి టిక్కెట్ హామీ రాకపోవడంతో జనసేనలో చేరారు. మొత్తం మీద రాజకీయంగా రావెల జీవితం ఒక్కసారికే పరిమితమయిందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. మరి రావెల తర్వాత స్టెప్ ఎలా ఉంటుందోనన్న ఆసక్తి ఆయన అనుచరుల్లో నెలకొని ఉంది.

Related Posts