యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
గౌరవనీయులు వెంకయ్య నాయుడు, మన భారత ఉప రాష్ట్రపతి గారికి నైపుణ్యాభివృద్ధి సంస్థ చేస్తున్నటువంటి పలు కార్యక్రమాలను వివరించడం జరిగింది.. ముఖ్యంగా గా గిరిజన, అగ్రికల్చర్, ఆక్వా మరియు సంబంధిత ప్రైమరీ స్కిల్స్ విషయంలో నైపుణ్య సంస్థ చేస్తున్నటువంటి వివరములు తెలియజేయడం జరిగింది. వారు టీం చేస్తున్నటువంటి కృషిని అభినందించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఐటీడీఏ పరిధిలో ఉన్న కేఆర్ పురం లో గిరిజన మహిళలు తయారు చేసిన మిల్లెట్ బిస్కెట్లు ఇతర ఉత్పత్తులను వాళ్లే తయారుచేసిన జూట్ బాగ్ లో పెట్టి బహూకరించడం జరిగింది. అందరూ ఇలాంటి ఉత్పత్తులను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు తెలిపారు. అలాగే వివరములు తెలియజేస్తున్న ప్పుడు ఉపరాష్ట్రపతి గారు ఐటిఐలను పునరుద్ధరించాల్సిన ఆవశ్యకత గురించి ప్రస్తావించారు. తదుపరి స్వర్ణ భారత్ ట్రస్ట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎస్‌ఎస్‌డిసి), డాక్టర్ ఏపీజే అబ్ధుల్ కలామ్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో ఎలక్ట్రీషియన్, ఏసీ మెకానిక్ విభాగంలో శిక్షణ పూర్తి చేసుకున్న 127 మంది యువతకు ఉపరాష్ట్రపతివెంకయ్యనాయుడు గారు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. స్వర్ణ భారతి ట్రస్ట్ నందు కల్పించిన అధునాతన సదుపాయాలను యువత గురించి వినియోగించుకోవాల్సిన దిగా సూచించారు