YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఎదురు లేని నవీన్ పట్నాయక్

ఎదురు లేని నవీన్ పట్నాయక్

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కు ఎన్నికల ఫలితాలు రాకముందే డిమాండ్ పెరుగుతుంది. ఆయనను తమలో కలుపుకునేందుకు ఇటు భారతీయ జనతా పార్టీ, అటు కాంగ్రెస్ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. నవీన్ పట్నాయక్ దాదాపు 20 ఏళ్లుగా ఒడిశాకు తిరుగులేని నేతగా వ్యవహరిస్తున్నారు. ఆయన పార్టీ బిజూ జనతాదళ్ మరోసారి విజయకేతనం ఎగురవేసే అవకాశాలుపుష్కలంగా ఉన్నాయి. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ఒడిశాలో ఒకేసారి జరగడంతో నవీన్ పట్నాయక్ కు కలసి వచ్చిందంటున్నారు. ఈనేపథ్యంలో నవీన్ ను మంచి చేసుకునే పనిలో పడ్డాయి జాతీయ పార్టీలు.వచ్చే లో్క్ సభ ఎన్నికల్లో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లు మ్యాజిక్ ఫిగర్ కు చేరుకునే అవకాశాలు లేవని స్పష్టంగా తెలుస్తోంది. బీజేపీకి 200 స్థానాలు, కాంగ్రెస్ కు వంద స్థానాలు మించి రావని సర్వేలుకూడా స్పష్టం చేస్తున్నాయి. ఈనేపథ్యంలో ప్రాంతీయ పార్టీలే కీలకంగా మారనున్నాయి. ఉత్తరాదిన ఉండే ప్రాంతీయ పార్టీలు దాదాపు ఏదో ఒక పక్షంలో చేరిపోయాయి. పశ్చిమబెంగాల్ లో మమత బెనర్జీ, ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీ అధినేతలు మాయావతి, అఖిలేష్ యాదవ్, బీహార్ లో ఆర్జేడీలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇక మహారాష్ట్రలో శివసేన, బీహార్ లో జనతాదళ్ (యు)లు బీజేపీకి మిత్రులుగా కొనసాగుతున్నారుఒక్క దక్షిణాదిలోనే ప్రాంతీయ పార్టీలు కొంత అటు ఇటుగా వ్యవహరిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీలకు సమదూరం పాటిస్తున్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయంగా దేశమంతా తిరుగుతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి రెండు పార్టీలనూ పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రత్యేక హోదా ఎవరు ఇస్తే వారికే తమ మద్దతు అని జగన్ అంటున్నారు. ఇక మిగిలింది ఒడిశా. ఒడిశాలో నవీన్ పట్నాయక్ సారధ్యంలోని బిజూ జనతాదళ్ కు కాంగ్రెస్, బీజేపీలు రెండు ప్రధాన శత్రువులే.ఒడిశాలో మొత్తం 21 లోక్ సభ నియోజకవర్గాలు ఉండటంతో నవీన్ పట్నాయక్ మద్దతు కీలకంగా మారనుంది. ఆయన ఇప్పటివరకూ జాతీయరాజకీయాలపై పెదవి విప్పలేదు. అలాగే జాతీయ రాజకీయాలకు వెళ్లాలన్న ఆకాంక్ష కూడా ఆయనకు లేదు.నవీన్ పట్నాయక్ కూడా ఒడిశాకు ప్రత్యేక హోదా కావాలని గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కువ స్థానాలను గెలుచుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి.దీంతో జాతీయ స్థాయిలో నవీన్ పట్నాయక్ పార్టీకి డిమాండ్ పెరిగిందంటున్నారు. ముందుగానే ఆయనను మంచిచేసుకునే ప్రయత్నాల్లో బీజేపీ,కాంగ్రెస్ లు ఉన్నాయి. మరి నవీన్ ఫలితాల విడుదల తర్వాత ఎవరి వైపు మొగ్గు చూపుతారో చూడాల్సి ఉంది.

Related Posts