YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఓటు హక్కు వినియోగించుకున్న 60 కోట్ల మంది

  ఓటు హక్కు వినియోగించుకున్న 60 కోట్ల మంది

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

ఏడు దశల్లో జరిగిన లోక్ సభ ఎన్నికలు ఆదివారం ముగిశాయి. మన దేశంలో దాదాపు 91 కోట్ల మందికి ఓటు హక్కు ఉండగా.. వారిలో 67.11 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని అంచనా. భారత పార్లమెంట్ ఎన్నికల చరిత్రలో ఇదే అత్యధిక పోలింగ్ శాతం కావడం గమనార్హం. సోమవారం ఉదయం నాటికి అందిన వివరాల ప్రకారం పోలింగ్ శాతం 67.11. కాగా.. ఎన్నికల సంఘం గణాంకాలను విడుదల చేస్తే.. ఇది కొంచెం అటు ఇటుగా మారే అవకాశం ఉంది. 2014లో 66.40 శాతం పోలింగ్ నమోదైంది. 2009లో 56.9 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 543 లోక్ సభ నియోజకవర్గాలకు గానూ 542 స్థానాల్లో ఎన్నికలను నిర్వహించారు. తమిళనాడులోని వెల్లూరులో ఎన్నికను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. 2014లో మన దేశంలో 83.40 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. మూడో దశ ఎన్నికలు జరిగిన ఏప్రిల్ 23 నాటికి ఇది 90.99 కోట్లకు చేరింది. ఎన్నికల సంఘం అందించిన వివరాల ప్రకారం తొలి దశలో అత్యధిక పోలింగ్ నమోదు కాగా.. ఆ తర్వాతి నుంచి ఓటింగ్ శాతం తగ్గుతూ వచ్చింది. మొదటి దశలో 69.61 శాతం పోలింగ్ నమోదైంది. రెండో దశలో 69.44 శాతం, మూడో దశలో 68.40 శాతం, నాలుగో దశలో 65.50 శాతం, ఐదో దశలో 64.16 శాతం, ఆరో దశలో 64.40 శాతం, ఏడో దశలో 65.15 శాతం చొప్పున పోలింగ్ నమోదైంది.2009లో స్త్రీ, పురుష ఓటర్ల మధ్య ఓటింగ్ అంతరం 9 శాతం ఉండగా.. 2014లో ఇది 1.4 శాతానికి తగ్గింది. ఈసారి అది మరింత తగ్గి 0.4 శాతంగా ఉండే అవకాశం ఉంది.

Related Posts