Highlights
- పెద్దమనిషి తరహాలో ప్యాకేజీకి ఒప్పుకున్నారు
- ఇప్పుడు అది కూడా ఇవ్వలేదు
- రాజీనామాలతో ఒరిగేదేమీ లేదు
- ఎన్డీయే నుంచి వైదొలగినా ప్రభుత్వం పడిపోదు
- జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలు
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్దమనిషి తరహాలో ఒప్పుకున్నా ప్యాకేజీని కూడా ఇవ్వనంటే ఊరుకునేదేలేదం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. అన్నాడు అయన హోదా బదులు ప్యాకేజీ ఇస్తానంటే ఒప్పుకున్నారని, ఇప్పుడు అది కూడా ఇవ్వకుంటే చూస్తూ ఊరుకోబోయేది లేదని అన్నారు.ఇక ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనన్నదే తమ ప్రధాన డిమాండని జేసీ తేల్చి చెప్పారు. వాస్తవానికి టీడీపీ ఎంపీలు రాజీనామాలు చేసినా కేంద్రం దిగి వచ్చే పరిస్థితి లేదని,తాము ఎన్డీయే నుంచి వైదొలగినా, ప్రభుత్వం పడిపోయే పరిస్థిత లేదని గుర్తు చేశారు. కానీ కేంద్రం నుంచి బయటకు రావాలని ప్రజల నుంచే డిమాండ్ వస్తోందన్నారు. ఈ విషయంలో అమిత్ షాతో ఎంపీలు చర్చలు జరిపినా ఏమీ సాధించలేదని అన్నారు. అయితే ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పన్నిన ఉచ్చులో చిక్కుకున్నారని, దాన్నుంచీ ఆయన బయట పడలేక పోతున్నారని తన మనస్సులోని మాటను బయటపెట్టారు. ఈ వ్యవహారంలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తలచుకుంటే ఏపనైనా జరుగుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన హామీల విషయంలో అవసరమైతే పోరాటం చేస్తామని తెలిపారు.జగన్ తన ఎంపీలతో రాజీనామా చేయిస్తే, తాను కూడా రాజీనామా చేస్తానని జేసీ అన్నారు