YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

త్రిముఖ పోటీలో షీలా దీక్షిత్ గట్టెక్కుతారా

 త్రిముఖ పోటీలో షీలా దీక్షిత్  గట్టెక్కుతారా

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

షీలా దీక్షిత్… ఈ పేరు తెలియని వారుండరు. 80 ఏళ్ల వయసులోనూ రాజకీయ పోరాటం చేస్తున్నారు. మూడు సార్లు ముఖ్యమత్రిగా పనిచేసిన షీలా దీక్షిత్ ఈసారి లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచారు. ఈశాన్య ఢిల్లీ నియోజకవర్గం నుంచి ఆమె కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్ తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు రంగంలో ఉండటంతో ఇక్కడ గెలుపు ఎవరన్నది అంచనా వేయడం కష్టమే.ఢిల్లీ పీఠం కాంగ్రెస్ చేజారిన తర్వాత యూపీఏ హయాంలో గవర్నర్ గా పనిచేసిన షీలా దీక్షిత్ ఎన్డీఏ అధికారంలోకి రావడంతో రాజీనామా చేశారు. కొంతకాలం ఢిల్లీ పార్టీ రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. అయితే లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాహుల్ గాంధీ షీలా దీక్షిత్ కు ఢిల్లీ పగ్గాలు అప్పగించారు. ఢిల్లీ పై గట్టి పట్టున్న షీలా దీక్షిత్ నేతలు, కార్యకర్తల అభిప్రాయాలను సేకరించారు. పార్టీ ఢిల్లీలో మళ్లీ బతికి బట్ట కట్టాలంటే ఒంటరిపోరే బెటరన్న అభిప్రాయాన్ని అనేకమంది నేతలు, కార్యకర్తలు వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని రాహుల్ కు షీలా తెలియజెప్పారు.వాస్తవానికి ఆమ్ ఆద్మీ పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవాల్సి ఉంది. కాంగ్రెస్ కు ఢిల్లీలోని ఏడు పార్లమెంటు స్థానాల్లో రెండు స్థానాలను ఇస్తామని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సంకేతాలు పంపారు. రెండు పార్టీల నేతల మధ్య చర్చలు జరిగాయి కూడా. కానీ షీలా పొత్తు వద్దంటే వద్దని పట్టుబట్టారు. ఆప్ తో పొత్తు పెట్టుకుంటే ఢిల్లీలో కాంగ్రెస్ క్యాడర్ కూడా మిగలదని ఆమె రాహుల్ కు నూరిపోశారు. దీంతో రాహుల్ సయితం ఆమె మాటను పరిగణనలోకి తీసుకుని ఆప్ కు కటీఫ్ చెప్పేశారు. అయితే ఇప్పుడు షీలా దీక్షిత్ ఈశాన్య ఢిల్లీ నుంచి గెలుస్తుందా? లేదా? అన్న చర్చ పార్టీలోనూ నడుస్తోంది. ఇక్కడి నుంచి ఆమె గెలిచి పార్టీకి నాలుగు లోక్ సభ స్థానాలు దక్కితే షీలా మరోసారి పార్టీలో రాణిగా చెలామణి అవుతారన్న
వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. అయితే ఏడు పార్లమెంటు స్థానాల్లో త్రిముఖ పోటీ నెలకొని ఉండటంతో కాంగ్రెస్ కు గెలుపు అంత ఈజీ కాదన్న అంచనాలు ఉన్నాయి. ఆప్, కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేయడం వల్ల బీజేపీ లబ్దిపొందుతుందంటున్నారు. మొత్తం మీద లోక్ సభ ఎన్నికల ఫలితాలు షీలా దీక్షిత్ సమర్థతకు అద్దం పడతాయన్న వ్యాఖ్యలు పార్టీలో విన్పిస్తున్నాయి

Related Posts