యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూసి జగన్ సంబరపడుతున్నాడు. జగన్ కే జనాదరణ ఉందని డబ్బా పత్రిక, చానల్ లో ఊదరగొట్టుకుంటున్నారు. చంద్రబాబు చెప్పినట్లు వందకు వేయి శాతం టిడిపి దే
విజయమని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మంగళవారం అయన మీడియాతో మాట్లాడారు. మహిళలు, వృద్దులు చంద్రబాబు అమలు చేసిన పధకాలకే పట్టం కట్టారని మేము
బయటకి వచ్చి ధైర్యంగా చెబుతున్నాం. నీ అభ్యర్థులు తో కూర్చుని సమావేశం కూడా నిర్వహించలేక లోటస్ పాండ్ కే పరిమితం అయ్యావని అయన ఆరోపించారు.
ఇప్పుడు లోటస్ పాండ్ ను కుడా కేసిఆర్ ఖాళీ చేయించి నిన్ను బయటకు పంపుతున్నారు. కార్యకర్తలును బెట్టింగ్ బారిన పడేసి గొప్పలు చెప్పుకుంటూ శునకానందాన్ని పొందుతున్నావు. డర్టీ
సాయి రెడ్డి నోటికోచ్చినట్లు కాస్తూ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పార్టీ అధ్యక్ష హోదాలో కనీసం మాట్లాడలేని దుస్థితి లో జగన్ ఉన్నాడు. పోలవరం అడ్డుకునేందుకా, అవినీతి కి
పాల్పడినందుకా, అమరావతి అభివృద్ధి ని అడ్డుకున్నందుకా .. ఏం చూసి నీకు ఓటేస్తారని ప్రశ్నించారు. అనేక కుట్రలు చేసిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఎక్కడకు పారిపోయాడు. దమ్ముంటే నువ్వు,
డర్టీ రెడ్డి, ప్రశాంత్ కిషోర్ లు జనంలోకి రండి. ఎపి ప్రభుత్వం తన పని తీరు ద్వారా ఎన్నో కేంద్ర అవార్డులు సాధించాం. దేశంలో ఎవరైనా ఇన్ని సాధించారా.. నిరూపించు జగన్ అని సవాల్ విసిరారు.
ఎపి లో 18 ఎంపి సీట్లు టిడిపి సాధించడం ఖాయం. మోడి నియంతృత్వ పాలనను పారద్రోలేందుకు వ్యతిరేక శక్తులను చంద్రబాబు ఏకం చేశారు. ఈవిఎం లు పని తీరు, వివి ప్యాట్ ల లెక్కింపు పై
చంద్రబాబు పోరాటం చేస్తున్నారు. జగన్ మాత్రం లోటస్ పాండ్ లో కూర్చుని.. లెక్కలు వేసుకుంటున్నాడని అన్నారు. ఆరా సంస్థ తో సర్వే చేయించి సిఎం అయిపోయినట్లు ఊహించుకుని ఏర్పాటు
చేసుకుంటున్నాడు. చిత్తశుద్ధి లేని శివ పూజలు ఎన్ని చేసినా ఫలితం ఉండదనే సూత్రం ఇప్పటికైనా జగన్ తెలుసుకోవాలి. చంద్రబాబు వల్లే అభివృద్ధి సాధ్యమని మహిళలంతా భావించి అర్ధరాత్రి
వరకు నిలబడి ఓట్లు వేశారు. చంద్రబాబు మళ్లీ సిఎం కావాలని గ్రామాలు, పట్టణాలలో ప్రజలు పూజలు చేస్తున్నారు. 2014లో కూడా అరాచక శక్తులు రాకూడదని ప్రజలు చంద్రబాబు ను గెలిపించారు.
అప్పుడు కూడా జగన్ సిఎం గా ప్రమాణ స్వీకారానికి సిద్దమై భంగపడ్డాడు. ఈసారి కూడా ముహూర్తాలు పెట్టుకున్న జగన్ ఇంటికే పరిమితం అవడం ఖాయమని అన్నారు.
16 నెలలు జైలులో ఉన్న జగన్, విజయసాయి రెడ్డి లు కూడా అవినీతి గురించి మాట్లాడేస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ తో వాళ్లు సంబరాలు చేసుకుంటే.. ఎగ్జాట్ పోల్స్ వచ్చాక మేం పండుగ చేసుకుంటాం.
కేవిపికి వయసు రాగానే సరి కాదు.. హుందాగా ఉండటం నేర్చుకో అని సలహ ఇచ్చారు.